Why A.P Gov't Employees Struggle ?

AP Govt Employees:

 

ప్రభుత్వానికి అల్టిమేటమ్.

 

ఏకమైన నాయకులు, సంఘాలు.

 

డిసెంబర్ నుంచి పోరుబాట

 

AP Govt Employees: గత ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్ వెంటే నడిచాయి ఉద్యోగ సంఘాలు. జగన్ భారీ మెజార్టీ సాధించడంలో ఉద్యోగులది కూడా కీలక పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు అవే ఉద్యోగ సంఘాలు. జగన్ సర్కార్ కు అల్టిమేటమ్ ఇచ్చారు నాయకులు.


ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.


పీఆర్సీ (PRC)తో పాటు పలు డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టాయి. ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వం (AP Government)తో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్యోగ సంఘాల నేతలు విజయవాడ (VIJAYAWADA)లో సమావేశమై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల వివక్ష చూపుతోందని ఆరోపించారు. పీఆర్‌సీ నివేదిక ఇస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలన్నారు.

ఉద్యోగులను కార్యాచరణ దిశగా ప్రభుత్వమే నెట్టిందని ఆరోపించారు. అందుకే ఇంతకాలం విడివిడిగా పోరాడిన ఉద్యోగ సంఘాలంతా ఇకపై ఒక్కటిగా పోరాడాలని నిర్ణయించాయి.

డిసెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు అంటే, నెల రోజుల పాటు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఉద్యోగులంతా ఉద్యమంలో పాల్గొని న్యాయమపరమైన సమస్యలు పరిష్కారమయ్యేలా చేసుకుందామని పిలుపు ఇచ్చారు.

ఇందులో భాగంగా డిసెంబరు 1న సీఎస్‌కు వినతి పత్రం సమర్పిస్తారు. డిసెంబరు 7 నుంచి 10 వరకు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. అదే రోజున మధ్యాహ్నం భొజన సమయంలో నిరసనలు తెలిపారు.

డిసెంబరు 13న అన్ని డివిజన్‌ కేంద్రాల్లో నిరసన ప్రదర్శలు చేస్తారు. 21న జిల్లా కేంద్రాల్లో మహాధర్నా నిర్వహిస్తారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు నిరసన తెలియచేయనున్నారు. డిసెంబరు 27న సాయంత్రం 4 గంటలకు విశాఖలో భారీ సదస్సు ఏర్పాటు చేస్తారు. అలాగే డిసెంబరు 30న తిరుపతిలో సదస్సు, అప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకుంటే జనవరి 3న ఏలూరులో ప్రాంతీయ సదస్సులు.

జనవరి 6న ఒంగోలులో మహా ప్రదర్శన నిర్వహిస్తామని బండి శ్రీనివాసరావు తెలిపారు. అక్టోబర్ నెలాఖరుకు పీఆర్సీ ఇస్తామని ప్రభుత్వం చెప్పిందనే విషయాన్ని ఏపీ జేఏసీ అధ్యక్షులు గుర్తు చేశారు. పీఆర్సీ నివేదిక అడిగినా. ఇంతవరకూ ఇవ్వలేదని, ఒకటో తేదీన జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు తేదీల్లో తాము పలు కార్యక్రమాలు చేయడం జరుగుతోందన్నారు.

ఉద్యమానికి వెళ్లాలని ఉద్యోగుల నుంచి ఒత్తిడి వస్తోందని, ఉద్యోగుల కోసం ఆత్మాభిమానం చంపుకుని అందరి దగ్గరకూ వెళ్లడం జరిగిందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యోగులు దాచుకున్న 1600 కోట్ల రూపాయలు ఎప్పుడిస్తారో చెప్పడం లేదని, ఉద్యోగ సంఘాలకు విలువ లేకుండా చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్థిక మంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తీరు ఉద్యోగులను బాధించిందని చెప్పారు. కరోనా సమయంలోనూ తాము ప్రభుత్వానికి పూర్తిగా సహకరించామన్నారు. విధిలేని పరిస్థితుల్లో ఉద్యమబాట పడుతున్నట్లు ప్రకటించారు. PRC నివేదికను బయటపెట్టడానికి ఇబ్బంది ఏంటి అని ఆయన సూటిగా ప్రశ్నించారు. వీరి ప్రకటనపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

 

ENGLISH -: Govt Employees: During the last election, వైసిపి leader జగన్ గారు was followed by job unions. There is no doubt that the employees also played a key role in జగన్ గారు achieving a huge majority. But now the same job unions. Leaders gave an ultimatum to వైసీపీ సర్కార్. Leaders of AP government job unions made a key decision. Along with the PRC, the Andhra Pradesh unions have struggled to meet various demands. The union leaders met in Vijayawada (VIJAYAWADA) to discuss the failure of several rounds of talks with the AP government. He accused the state government of discriminating against employees and teachers. He was criticized for saying that the PRC would give a report.

The government still needs to respond to the fair demands of the employees. It is alleged that the government pushed the employees towards activism. That is why all the unions that have been fighting separately so far have decided to fight together now.

From December 1st to the 30th, that is, for a month and a half, various forms of concern were announced. He called on all employees to join the movement and resolve legal issues. As part of this, a petition will be submitted to the CS on December 1.

Attending duties from December 7 to 10 wearing black badges. Protesters said during lunch on the same day. Protests will be held on December 13 in all divisional centers.

మహాధర్నా will be held in the district centers on the 21st. The protest will continue until two o'clock in the afternoon. A huge conference will be held on December 27 at 4 pm in Visakhapatnam. Also, a conference in తిరుపతి on December 30, and regional conferences in ఏలూరు on January 3 if there is still no response from the government.

బండి శ్రీనివాస రావు  said that a grand exhibition will be organized in ఒంగోలు on January 6. The AP JAC presidents recalled that the government had said it would give the PRC by the end of October. If the PRC asks for a report. Awareness has been expressed that the salaries have not been paid till now and there is a situation where salaries cannot be paid even on a certain date.

On this occasion, they are doing various events on different dates. బొప్పరాజు వెంకటేశ్వర్లు said that pressure was coming from the employees to go for the movement, killing the self-esteem for the employees and going to everyone.

He said that he was not saying when the Rs 1600 crore hidden by the employees would be released and that the unions were looking on without value. On this occasion, they are doing various events on different dates. బొప్పరాజు వెంకటేశ్వర్లు said that pressure was coming from the employees to go for the movement, killing the self-esteem for the employees and going to everyone.

 

He said that he was not saying when the Rs 1600 crore hidden by the employees would be released and that the unions were looking on without value.

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author