జీవితం ప్రతిరోజు ఒక పాఠాన్ని నేర్పుతూ ప్రతిరోజు మరొక సవాల్ను మనకు ఇస్తూ ఉంటుంది.
అయితే ఆ సవాల్ను మనం ఎలా అయితే స్వీకరిస్తాము దాని యొక్క ప్రతిఫలం కూడా అలాగే ఉంటుంది.
దీన్ని వివరించే ప్రయత్నం లో ఒక చిన్న పిట్టకథ అనేది ఇప్పుడు మనం చూద్దాం.
ఒక నది ఒడ్డున రెండు పెద్ద చెట్లు ఉంటాయి. అటువైపుగా వెళ్తున్న ఒక పక్షి ఆ రెండు చెట్లను చూసి మొదటి చెట్టు దగ్గరికి వెళ్లి వర్షాకాలం రాబోతుంది నా పిల్లల కోసం ఈ చెట్టు కొమ్మల మీద కట్టుకుంటాను చెట్టు నీదేనా అని అడిగింది. దానికి మొదటి చెట్టు ఖరాఖండిగా కుదరదు. నా కొమ్మల మీద నువ్వు గూడు కట్టుకోవడం కుదరదు అని అంటుంది.
అప్పుడు పక్షి ఏం చేస్తాంలే అని అనుకొని రెండో చెట్టు దగ్గరికి వెళుతుంది. అయితే ఆ రెండో చెట్టు సరే నువ్వు గూడు కట్టుకో అంటుంది. అప్పుడు ఆ పక్షి ఎంతో ఆనందించి ఆ చెట్టుకు కృతజ్ఞతలు తెలిపి గూడు కట్టుకుంటుంది. ఇంత లోనే వర్షాకాలం వచ్చింది.
ఈ భీకర వర్షాలకు తట్టుకోలేక మొదటి చెట్టు కూకటివేళ్లతో సహా పెకిలిపోయి నదిలో కొట్టుకు పోతుంది. అప్పుడు ఆ పక్షి చూసి ఆ రోజు నేను నీ కొమ్మ మీద గూడు కట్టుకుంటే అంటే నువ్వు వద్దు అన్నావు. దానికి భగవంతుడు నీకు ఈ శిక్ష వేశాడు అని అంటుంది. అయితే మిత్రులారా మీరు కనుక ఈ పక్షి స్థానంలో ఉంటే అలా కామెంట్ చేసే వాళ్ళ లేదా మరోలా ఆలోచించేవారు.
మీ కోణంలో ఇప్పుడు మీరు ఎలా ఆలోచించారు అసలు ఆ పరిస్థితిలో ఎలా ఆలోచించాలి అనేది ఈ వ్యాసం చివరిలో తెలుస్తుంది.
ఇప్పుడు కథలోకి మరలా వస్తే పక్షి అలా అన్నప్పుడు చెట్టు దానికి సమాధానం గా భారీ వర్షాలు వచ్చినప్పుడు నేను ఆ దాటికి తట్టుకోలేక కొట్టుకు పోతాను అని నాకు తెలుసు ఎందుకంటే నేను బలహీనంగా ఉన్నాను. అందుకే నేను నీకు గూడు కట్టుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. ఒకవేళ ఆ రోజు గూడు కట్టుకోమని చెబితే ఈ వేళ ఈ ప్రవాహంలో నాతోపాటు నువ్వు నీ పిల్లలు కూడా కొట్టుకు పోవాల్సి వచ్చేది, అని సమాధానం చెప్పింది. చెట్టు చెప్పిన సమాధానానికి తనలో తాను ఎంతో పశ్చాత్తాపానికి గురై కుమిలిపోయింది. ఈ కథ ద్వారా మనం ఎవరైనా సహాయం చేయడానికి నిరాకరిస్తే తప్పుగా అనుకోకూడదు. వారు ఏ నిస్సహాయస్థితిలో అలా చేశారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అనే విషయాన్ని మనకు తెలుపుతుంది. అయితే చూడండి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఉండరు కొంతమంది కావాలని సహాయం చేయరు.
మరియు చివరగా పక్షిలాగా ఆలోచించిన వారు సాధారణ వ్యక్తి అలా కాకుండా పడిపోతున్న చెట్టు లాగా ఆలోచించిన వారు ఉన్నతమైన వ్యక్తి అవుతారు.
అటువంటి వారికి నిజంగానే భగవంతుడు తగిన శిక్ష సరైన సమయంలో విధిస్తాడు మీరు బాధ పడవలసిన అవసరం లేదు.
Life teaches us a lesson every day and gives us another challenge every day.
But the rewards of how we accept that challenge will remain the same.
Let us now look at a short aphorism in an attempt to illustrate this.
There are two large trees on the bank of a river. A bird on the other side looked at the two trees and went to the first tree and asked if the tree was yours. The first tree can not be perfect. You say you can't nest on my branches.
The bird then approaches the second tree, wondering what to do. But the second tree says you can build a nest. Then the bird is very happy and thanks to the tree nests. The rainy season came soon after.
Unable to withstand the onslaught of rain, the first tree toppled over and fell into the river. Then the bird looked up and said that day if I nest on your branch it means you don't want to. It says that God has given you this punishment. But friends, if you are in the place of this bird, those who comment like that or think otherwise.
It will be clear at the end of this article how you think in your sense now how you actually thought in that situation.
Now back to the story when the bird said so the tree responded to it by saying that when the heavy rains came I knew I would be swept away because I could not stand beyond that. That is why I did not allow you to build a nest. If you had told me to build a nest that day you would have had to swim with me and your children in this stream. He was deeply remorseful for the answer given by the tree. We should not be mistaken if we refuse to help anyone through this story. They should try to understand in what helplessness they did so. Tells us that. See though not everyone will be like this and some will not help intentionally.
And finally those who think like a bird will become a superior person who thinks like an ordinary person rather than a falling tree.
For such people God will truly punish at the right time so you do not have to suffer.
You must be logged in to post a comment.