Viral: సోదరుడి పెళ్లిలో మిగిలిపోయిన ఆహారాన్ని రైల్వే స్టేషన్‌కు తీసుకొచ్చి.. ఈ మహిళ చేసిన మంచి పనికి హ్యాట్సాప్‌ చెప్పాల్సిందే..How

Viral: సోదరుడి పెళ్లిలో మిగిలిపోయిన ఆహారాన్ని రైల్వే స్టేషన్‌కు తీసుకొచ్చి. ఈ మహిళ చేసిన మంచి పనికి హ్యాట్సాప్‌ చెప్పాల్సిందే.

దానాల్లో అన్నదానానికి మించిన గొప్పది మరొకటి లేదంటారు చాలామంది. అయితే దీనిని చేతల్లో చూపేవారు చాలా తక్కువమందే ఉంటారు. ఈ క్రమంలో కోల్‌కతాకి చెందిన ఓ మహిళ తన సోదరుడి పెళ్లిలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఆకలితో ఉన్నవారికి పంచిపెట్టారు. ఇది చాలామంది చేస్తున్నదే కదా అని అనుకోవచ్చు. కానీ ఆమె అర్ధరాత్రి వేళ ఏకంగా రైల్వేస్టేషన్‌కి వెళ్లి స్వయంగా అనాథలకు భోజనం వడ్డించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. పెద్ద మనసుతో ఆమె చేసిన పనిని అందరూ అభినందిస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. సాధారణంగా మన దేశంలో పెళ్లిళ్లంటే ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నోరూరించే వంటకాలతో విందులు, సంగీత్‌లు, బరాత్‌లు, మెహెందీలు, బహుమతులు. ఇలా ఎన్నో ఉంటాయి.

 

మానవత్వం ఇంకా ఉందని నిరూపించారు.

చాలా పెళ్లి వేడుకల్లో పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు మిగిలిపోవడం మనం చూస్తూనే ఉంటాం. వాటిని వృథాగా పోనివ్వకుండా మరుసటి రోజున వాటిని అవసరమైన వారికి అందజేస్తుంటాం. ఈక్రమంలోనే కోల్‌కతాకి చెందిన పాపియ కర్‌ అనే మహిళ తన సోదరుడి పెళ్లిలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను  పెద్ద బకెట్లు, పాత్రల్లో నింపి అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కోల్‌కతా సబర్బన్ రైల్వే స్టేషన్‌ రాణాఘాట్‌కు తీసుకొచ్చారు. అక్కడ ఉన్న అనాథలందరినీ పిలిచి పేపర్ ప్లేట్లలో స్వయంగా అందరికీ కడుపు నిండా భోజనం వడ్డించారు. ఈ క్రమంలో సంప్రదాయ దుస్తుల్లో ఓ రైల్వే ప్లాట్‌ఫాంపై కూర్చొని అనాథలకు అన్నం వడ్డిస్తో్న్న ఆ మహిళ ఫొటోలను అక్కడే ఉన్న నీలాంజన్ మండల్ అనే ఫోటోగ్రాఫర్ తన కెమెరాల్లో బంధించాడు. అనంతరం వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. ‘ఇలాంటి వారిని చూసినప్పుడే ఈ లోకంలో ఇంకా మానవత్వం ఉందన్న నమ్మకం కలుగుతోంది. ఆమె చాలామంచి పనిచేసింది. మిగతా వారందరూ ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలి. అన్నదానం కంటే మించింది మరొకటి లేదు’ అంటూ ఆ మహిళపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

Viral Video: రెస్టారెంట్‌లో ఆహారం తింటుండగా పడిపోయిన వ్యక్తిని ఎలా కాపాడారో చూడండి. వీడియో వైరల్‌.

 

Viral Video: ఓ రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి ఒక్కసారిగా టేబుల్‌పై పడిపోవడంతో అక్కడున్న వెయిటర్స్‌ ఆందోళనకు గురయ్యారు. రెస్టారెంట్‌కు వచ్చిన ఓ వ్యక్తి ఫుడ్‌ తింటుండగానే టేబుల్‌పైనే.

Viral Video: రెస్టారెంట్‌లో ఆహారం తింటుండగా పడిపోయిన వ్యక్తిని ఎలా కాపాడారో చూడండి. వీడియో వైరల్‌.!

Viral Video: ఓ రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి ఒక్కసారిగా టేబుల్‌పై పడిపోవడంతో అక్కడున్న వెయిటర్స్‌ ఆందోళనకు గురయ్యారు. రెస్టారెంట్‌కు వచ్చిన ఓ వ్యక్తి ఫుడ్‌ తింటుండగానే టేబుల్‌పైనే పడిపోయాడు. వెంటనే స్పందించిన వెయిటర్స్‌, పోలీసు వచ్చి హీమ్లిచ్ పద్ధతి ద్వారా ప్రాణాలను కాపాడారు. అప్పుడప్పుడు ఆహారం తింటుండగా గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపిస్తే ఆ వ్యక్తి పడిపోతుంటాడు. అలాంటి సమయంలో కొన్ని పద్దతులు ఉపయోగిస్తే ఆ వ్యక్తిని కాపాడవచ్చు. ఈ సీసీ పుటేజీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన బ్రెజిల్‌లోని సావో పాలోలో జరిగింది.

 

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో 38 ఏళ్ల వ్యక్తి తన ఆహారాన్ని తింటూ ఊపిరి ఆడక టేబుల్‌పై కుప్పకూలిపోయాడు. రెస్టారెంట్‌లోని కస్టమర్లు, రెస్టారెంట్‌ సిబ్బంది వెంటనే గమనించి అతడిని లేపేందుకు ప్రయత్నించారు. అలాగే హైవే పెట్రోలింగ్ అధికారి కూడా సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని పైకి లేపుతూ కాపాడే ప్రయత్నం చేయడంతో అతను కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చాడు.రెస్టారెంట్‌లో అతని ప్రాణాలు కాపాడిన వారిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

హీమ్లిచ్ అంటే ఏమిటి?

 

హీమ్లిచ్‌ అంటే. ఊపిరి పీల్చుకునే వ్యక్తి గొంతు నుండి ఆహారం లేదా ఇతర అడ్డంకులను తొలగించడానికి ఉపయోగించే ఒక సాంకేతికతను హీమ్లిచ్ అంటారు. ఒక వ్యక్తి మరొకరి వెనుక నిలబడి, వారి పిడికిలితో వ్యక్తి యొక్క పక్కటెముకలోకి పెద్ద థ్రస్ట్ ఇస్తాడు. ఆ వ్యక్తిని వెనుక భాగం నుంచి పట్టుకుని ఉక్కిరి బిక్కిరి చేస్తారు. ఇలా కొంత సేపు చేయడం ద్వారా మనిషి స్పృహలోకి వస్తాడు.

 

ఇది ఎలా పని చేస్తుంది?

 

గొంతు నుండి దేనినైనా తొలగించటానికి ఒకరి కడుపుపై ​నొక్కడం కొంచెం వింతగా అనిపిస్తుంది. కాని హీమ్లిచ్ చాలా ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించబడింది. మనిషిని ఉక్కిరిబిక్కిరి చేయడం వల్ల గొంతు నుండి ఆహారాన్ని వెనక్కి నెట్టడానికి ఉపయోగపడుతుంది. గొంతులో ఏదో చిక్కుకున్నట్లు మీకు అనిపిస్తే. దగ్గు వచ్చేలా ప్రయత్నించాలి.

Asthma: గత ఏడాదికిపైగా విజృంభించి తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి. వివిధ వేరియంట్లుగా పుట్టుకొచ్చి మరింత ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా సౌతాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్‌ వేరియంట్‌ మళ్లీ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే ఆస్తమా ఉన్న పిల్లలకు కరోనా సోకితే ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై స్కాట్లాండ్‌ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం. ఆస్తమా ఉన్న పిల్లలకు కోవిడ్‌ సోకినట్లయితే కోలుకునే అవకాశాలు చాలా తక్కువ అని అధ్యయనం ద్వారా తేల్చారు. ఒక వేళ కరోనా లక్షణాలు కనిపించినట్లయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినట్లయితే ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉందంటున్నారు. మిగతా పిల్లలతో పోలిస్తే ఆస్తమా ఉన్న పిల్లలకు రోగనిరోధక శక్తి చాలా తక్కువ. ఇంగ్లండ్‌లోని 5 నుంచి 17 ఏళ్ల లోపు ఏడున్నర లక్షల మంది పిల్లలపై ఈ పరిశోధన నిర్వహించారు శాస్త్రవేత్తలు. ఈ అధ్యయన ఫలితాలను ‘ది లాన్సెట్‌ రెస్పిరేటరీ మెడిసిన్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది. ఆస్తమా ఉన్న 380 మంది పిల్లల్లో ఒక్కరు మాత్రమే త్వరగా కోలుకున్నారని, మిగతా పిల్లల పరిస్థితి ప్రమాదకరంగానే ఉందని గుర్తించారు.

 

అయితే అధ్యయనం ప్రకారం. ఈ అస్తమా 3 నుంచి 38 శాతం పిల్లలను, 2 నుంచి 12 శాతం పెద్దలను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. భారతదేశంలో 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో ఆస్తమా ప్రాబల్యం 2.05 శాతం ఉన్నట్లు నిపుణులు తెలిపారు. ఇక అస్తమా ఉన్న వారు ఆహార నియమాలు పాటించడం వల్ల మెరుగుపర్చుకోవచ్చు.తాజా పండ్లు, కూరగాయలను కలిగి ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవాలి.

Asthma: అస్తమా ఉన్న పిల్లలు కరోనా బారిన పడితే ప్రమాదమే. తాజా అధ్యయనంలో కీలక విషయాలు.

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author

Am rajitha am a blogger If any one contact me Mail : [email protected]