Top :Unstoppable with NBK: సరికొత్త రికార్డు సాధించిన బాలయ్య టాక్ షో. దేశంలోనే నెంబర్ వన్ గా అన్ స్టాపబుల్.

Unstoppable with NBK: సరికొత్త రికార్డు సాధించిన బాలయ్య టాక్ షో. దేశంలోనే నెంబర్ వన్ గా అన్ స్టాపబుల్.

నటసింహం నందమూరి బాలకృష్ణ ఓవైపు హీరోగా నటిస్తునే మరో వైపు హోస్ట్ గాను అదరగొడుతున్నారు. రీసెంట్ గా అఖండ గా గర్జించిన బాలయ్య. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం హోస్ట్ గా మారి అన్ స్టాపబుల్ షోతో ఆకట్టుకుంటున్నారు. మొదటిసారి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో కావడంతో ఈ షో భారీ రేటింగ్ తో దూసుకుపోతుంది. బాలయ్య గెస్ట్ లుగా వచ్చిన స్టార్స్ తో తనదైన స్టైల్ లో సందడి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ షో ఎనిమిది ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. ఈ షోను బాలయ్య తనదైన శైలిలో నడిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. మొదటి షో నుంచి అన్ స్టాపబుల్ గా సాగుతుంది ఈ టాక్ షో. మొదటి షోకు గెస్ట్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హాజరయ్యారు. ఆ తర్వాత నాని బ్రహ్మానందం, అనీల్ రావిపూడి, సుకుమార్, రష్మిక మందన్న, అల్లు అర్జున్, రవితేజ, గోపీచంద్ మలినేని, రానా, మహేష్ బాబు ఇలా చాలా మంది స్టార్స్ ఈ షోకు హాజరయ్యి ఆకట్టుకున్నారు.

ఇక అన్ స్టాపబుల్ షో మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా నిలిచింది బాలయ్య అన్ స్టాపబుల్.  ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ) ఇండియా టాక్ షోలపై నిర్వహించిన సర్వేలో బాలయ్య ‘అన్ స్టాపబుల్’ మొదటి స్థానంలో నిలిచింది. 9.7 పాయింట్లతో ఈ షో టాప్ లో ఉంది. ఆ తర్వాత  బాలీవుడ్ లో కపిల్ శర్మ నిర్వహిస్తున్న ‘ది కపిల్ శర్మ షో’ నిలిచింది. ఈ షో 7.8 పాయింట్లు దక్కించుకుంది. ఇదిలా ఉంటే అందాల భామ ఐశ్వర్య రాయ్ నిర్వహిస్తున్న ‘అమెజాన్ ఫ్యాషన్ అప్’ షో 4.9 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది. మొత్తంగా బాలయ్య అన్ స్టాపబుల్ షో  ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా అగ్రస్థానంలో నిలిచింది.

సినిమాతారలను వదలని మహమ్మారి. వరుసగా

 కరోనా బారిన పడుతున్న మూవీ స్టార్స్. ఆందోళనలో అభిమానులు

కరోనా మహమ్మారి సామాన్యులనుంచి సెలబ్రెటీల వరకు అందరిని  గురిచేస్తుంది. ఎన్ని  జాగ్రత్తలు తీసుకున్న కరోనా మహమ్మారి సోకకుండా వదలడం లేదు.

కరోనా మహమ్మారి సామాన్యులనుంచి సెలబ్రెటీల వరకు అందరిని  గురిచేస్తుంది. ఎన్ని  జాగ్రత్తలు తీసుకున్న కరోనా మహమ్మారి సోకకుండా వదలడం లేదు. గత రెండు వేవ్ లనుంచి తప్పించుకున్నవారు ఇప్పుడు థర్డ్ కాటుకు గురవుతున్నారు. ఇక సినిమా తారలు వరుసగా కరోనా బారిన పడటం ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తుంది. టాలీవుడ్ బాలీవుడ్ అని తేడాలేకుండా సినిమాతారలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే టాలివుడ్ లో మహేష్ బాబు, త్రిష, రాజేంద్ర ప్రసాద్, నవీన్ పోలిశెట్టి, బండ్లగణేష్ ఇలా పలువురు కరోనా బారిన పడ్డారు.అలాగే సీనియర్ హీరోయిన్లు శోభన, మీనా కుటుంబం, కుష్భు, మంచు మనోజ్ మంచు లక్ష్మీ కూడా ఈ వైరాస్ బారినపడ్డారు.  రీసెంట్ గా రేణు దేశాయ్ ఆమె కుమారుడు అకీరా నందన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. అటు బాలీవుడ్ లోను కరోనా మహమ్మారి విజృంభిస్తుంది.

ఇక నటుడు సత్యరాజ్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన… చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.  తాజాగా ఆయన కుమారుడు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ కరోనా నుంచి సత్య రాజ్ కోలుకున్నారని తెలిపాడు.  దాంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author