Top:RythuBandhu KCR : సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘రైతుబంధు కేసీఆర్’. ట్విట్టర్‌లో టాప్‌లో.

  సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘రైతుబంధు కేసీఆర్’. ట్విట్టర్‌లో టాప్‌లో.

సోషల్ మీడియాలో సోమవారం ‘రైతుబంధు కేసీఆర్’ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది. తెలంగాణ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు కొన్ని వేల మంది రైతుబంధు కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ ఈ మేరకు ట్వీట్లు చేశారు.
ప్రధానాంశాలు:
*సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌గా రైతుబంధు కేసీఆర్
*ట్విట్టర్‌లో టాప్‌లో నిలిచిన వైనం
*సీఎం కేసీఆర్ మానసపుత్రిక రైతుబంధు అన్న కేటీఆర్
తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు ద్వారా గత నాలుగేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సాయం పంపిణీ సోమవారంతో రూ.50 వేల కోట్లకు చేరుకుంది. ఇటు రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలను సర్కార్ నిర్ణయిస్తోంది.

ఈక్రమంలోనే సోషల్ మీడియాలో సోమవారం ‘రైతుబంధు కేసీఆర్’ #RythuBandhuKCR అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది.
#RythuBandhuKCR హ్యాష్ ట్యాగ్‌తో తెలంగాణ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు కొన్ని వేల మంది రైతుబంధు కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ట్విట్టర్‌లో #RythuBandhuKCR హ్యాష్ ట్యాగ్ టాప్‌లో నిలిచింది.

సీఎం కేసీఆర్ మానసపుత్రిక రైతుబంధు అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణభవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రైతుల కోసం తీసుకొని వచ్చినందుకు కేసీఆర్‌కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఇటు విపక్షాలపై కేటీఆర్ మండిపడ్డారు. రైతుల సంక్షేమం అంటే ఏంటో ఆ పార్టీలకు తెలియదని. అందుకే ప్రభుత్వ పథకాలపై అనవసర ఆరోపణలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు.
వ్యవసాయం కోసం పెట్టుబడిని ఋణంగా నగదు రూపంలో రైతులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతుబంధు పథకం.ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 2018, మే 10న కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి - ఇందిరానగర్‌ వద్ద ప్రారంభించారు. మొట్టమొదటి సారిగా ధర్మరాజుపల్లి వాసులు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా చెక్కులు, పట్టాదార్‌ పాసు పుస్తకాలు అందుకున్నారు.
రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.5 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేయనుంది. ఖరీఫ్, రబీ సీజన్ లకు ఎకరానికి రూ. 5000 చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 10000 పెట్టుబడిగా ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని రైతుకు చెక్కుల రూపంలో ఇవ్వనున్నారు. అదే విధంగా ఈ పథకం కింద నిల్వ ఉంచిన సరుకుపై రుణం తీసుకున్న రైతులకు ఆరు నెలల పాటు వడ్డీ రాయితీ ఇస్తారు. రైతులు తాము తీసుకున్న రుణాలపై ఎలాంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరు నెలల తర్వాత అనగా 181 వ రోజు నుంచి 270 వ రోజు వరకు వారు తీసుకున్న రుణంపై 12 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 58.34 లక్షల మంది రైతులకు పెట్టుబడిసాయం అందిస్తుంది.  గిరిజనభూములు కలిపి మొత్తం కోట్ల ఎకరాలకు.ఈ పథకం అమలుకోసం బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించారు. తెలంగాణా రాష్ట్ర గణాంక సంకలనం 2020 ఉన్న వివరములను పరిశీలిస్తే, రైతుబంధు పథకం కింద పొందిన వ్యవసాయదారులలో 90% చిన్నరైతులు, సన్నకారు రైతులే ఉన్నారు. ఈ పథకం మొత్తం లబ్ది పొందిన వాటిలో నల్గొండ జిల్లాలోని 4,32,059 రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనము పొందినారు. రాష్ట్రము మొత్తములో ఎక్కువ మొత్తంలోరైతుబంధు పథకం ప్రయోజనం పొందిన రైతులలో నల్గొండ జిల్లా ప్రథమ స్థానం లో ఉన్నది, తర్వాతి స్థానాలలో సంగారెడ్డి, రంగారెడ్డి, ఖమ్మం, నాగర్ కర్నూల్ జిల్లాలు ఉన్నవి. రైతుబంధు లబ్దిదారులను క్రింది పట్టిక ద్వారా చూడ వచ్చును.
మొదట్లో 2018-19 సంవత్సరంలో ఎకరానికి రూ.4వేల చొప్పున రెండు పంటలకోసం రెండు విడతల్లో ప్రతి రైతుకు మొత్తం ఏడాదికి రూ. 8వేలను ప్రభుత్వం అందించారు. పునాస పంట పెట్టుబడిని ఏప్రిల్‌ నుంచి, యాసంగి పంట పెట్టుబడిని నవంబర్‌ నుంచి పంపిణీ చేశారు. 2019-20 నుంచి పంట పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచి, రైతుకు ఎకరాకు సంవత్సరానికి రూ.10 వేలు అందజేస్తున్నారు. ఈ పథకం కింద 2021 వరకు రూ.50 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమచేయబడ్డాయి. పంట పెట్టుబడి పథకం వల్ల 90.5 శాతం ఉన్న పేద రైతులు లబ్ధి పొందారు.
ప్రపంచ దేశాల్లో రైతుల అభివృద్ధి కోసం చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో ఐక్యరాజ్యసమితి ఎంపిక చేసిన 20 పథకాలలో రైతుబంధు పథకం ఒకటి. 2018 నవంబరు 20 నుండి 23 వరకు 'వ్యవసాయాభివృద్ధిలో వినూత్న ఆవిష్కరణలు' అనే అంతర్జాతీయ సదస్సు ఐరాసలోని వ్యవసాయ విభాగం ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎవో) కేంద్ర కార్యాలయం రోమ్ నగరంలో జరిగింది. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతుబంధు, రైతుబీమా పథకాలను ఎంపిక చేయగా, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలపై ప్రత్యేక ప్రజంటేషన్ ఇచ్చాడు.

 

 

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author