TOP : Pushpa Movie Review: రివ్యూ: పుష్ప- ది రైజ్.

అల్లు అర్జున్‌  సుకుమార్‌ కాంబినేషన్‌లో ‘ఆర్య’, ‘ఆర్య 2’ వచ్చాయి. ‘ఆర్య’ అదరగొట్టగా. ‘ఆర్య 2’ ఫర్వాలేదనిపించింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత హ్యాట్రిక్‌ మూవీ ప్రకటించగానే అందరిలోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక బన్నీని ఊర మాస్‌ లుక్‌లో ‘పుష్ప’ పరిచయం చేసిన తర్వాత ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. అల్లు అర్జున్‌ ఎర్రచందనం స్మగ్లర్‌గా నటించటం, రష్మిక  డీగ్లామర్‌ పాత్ర చేయటం, సునీల్‌, మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండటం ఆసక్తిని కలిగించింది. మరి ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘పుష్ప’ ఎలా ఉంది? పుష్పరాజ్‌గా మాస్‌ లుక్‌లో అల్లు అర్జున్‌ ఎలా నటించారు? అసలు ఈ సినిమా కథేంటి?కథేంటంటే: పుష్ప  అలియాస్ పుష్ప‌రాజ్ (అల్లు అర్జున్) ఓ కూలీ. ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌ని మ‌న‌స్త‌త్వం. అయిన‌వాళ్లు త‌న ఇంటి పేరు కూడా లాక్కోవ‌డంతో క‌సితో పెరుగుతాడు. కూలీ చేసే చోట కేశ‌వ అనే స్నేహితుడు క‌లిశాక పుష్ప  ప్ర‌యాణ‌మే మారిపోతుంది. కూలీ నుంచి ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌రైన పుష్ప. ఆ తర్వాత కొండా రెడ్డి (అజ‌య్ ఘోష్‌) అత‌ని సోద‌రుల‌కి స్మగ్లింగ్‌లో ఉపాయాలు చెప్పే స్థాయికి ఎదుగుతాడు. ఆ త‌ర్వాత ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లర్‌ల సిండికేట్‌లో ఓ భాగ‌స్వామిగా, త‌ర్వాత సిండికేట్‌నే శాసించే స్థాయికి చేరుకుంటాడు. అప్పటివరకు ఆ స్థాయిలో ఉన్న మంగ‌ళం శ్రీను (సునీల్‌)కి కంట‌గింపుగా మారుతుంది. అపాయ‌క‌ర‌మైన మంగ‌ళం శ్రీను, కొండా రెడ్డి బ్ర‌ద‌ర్స్‌తో శ‌త్రుత్వం పెంచుకున్న పుష్ప‌కి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? శ్రీవ‌ల్లి (ర‌ష్మిక‌)ని ప్రేమించిన పుష్ప ఆమెని పెళ్లాడాడా లేదా?కొత్త‌గా వ‌చ్చిన ఎస్పీ భన్వ‌ర్‌ సింగ్ షెకావ‌త్ (ఫహాద్ ఫాజిల్‌)తో పుష్ప‌కి ఎలాంటి స‌వాళ్లు ఎదురయ్యాయ‌న్న‌ది తెలియాలంటే ‘పుష్ప: ది రైజ్‌’  చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఇప్పటివరకూ వివిధ మాఫియాల నేపథ్యంలో వందల కథలను దర్శకులు వెండితెరపై చూపించారు. హవాలా, డ్రగ్స్‌, ఆయుధాలు, మనుషుల అక్రమ రవాణా. ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతిదీ ఒక సబ్జెక్ట్‌ అవుతుంది. ‘పుష్ప’ కోసం దర్శకుడు సుకుమార్‌ ‘ఎర్రచందనం’ స్మగ్లింగ్‌ నేపథ్యాన్ని, మాస్‌లో మంచి క్రేజ్‌ ఉన్న అల్లు అర్జున్‌ని కథానాయకుడిగా ఎంచుకున్నాడు. ఈ పాయింటే ‘పుష్ప’పై అంచనాలు ఏర్పడేలా చేసింది. అందుకు తగినట్లుగానే ప్రేక్షకులను మెప్పించేలా కథ, కథనాలను తీర్చిదిద్దడంలో సుకుమార్‌ కొంతవరకు సఫలమయ్యాడు. ఎర్ర‌చంద‌నం ఎంత విలువైందో, అది మ‌న శేషాచ‌లం అడ‌వుల నుంచి జ‌పాన్ వ‌ర‌కు ఎలా ప్ర‌యాణం చేస్తుందో చెబుతూ ఆరంభ స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు సుకుమార్‌. ఆ ఎపిసోడ్ ప‌క్కాగా ఆయ‌న మార్క్‌తో ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. ఆ త‌ర్వాత పుష్ప ప్ర‌యాణం మొద‌ల‌వుతుంది. ప్ర‌థ‌మార్ధంలో హీరో నేప‌థ్యాన్ని, త‌న తండ్రి చ‌నిపోయాక ప‌రిస్థితులు మాత్రం కొంచెం భావోద్వేగాలు పంచుతాయి. ఆ తర్వాత ఎర్రచందనం రవాణా, సిండికేట్‌ తదితర వ్యవహారాలతో కథను ముందుకు నడిపిన దర్శకుడు ఆసక్తి కలిగించేలా ఆయా సన్నివేశాలను గ్రాండ్‌ లుక్‌తో తెరపై చూపించాడు. ప్రతి సన్నివేశం కథానాయకుడి పాత్రను ఎలివేట్‌ చేసేలా తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా బన్నీ అభిమానులకు కనులపండుగగా ఉంటుంది. ఒకవైపు పుష్పరాజ్‌ ప్రయాణాన్ని చూపిస్తూనే, మరోవైపు సిండికేట్‌ వెనుక ఉన్న అసలు పాత్రలను పరిచయం చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచాడు దర్శకుడు. పుష్పరాజ్‌ కూలీ నుంచి సిండికేట్‌ నాయకుడిగా అడుగులు వేయడానికి దోహద పడేందుకు అవసరమైన బలమైన సన్నివేశాలు తెరపై చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. విరామం ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. దీంతో ‘పుష్ప’ పాత్ర పతాక స్థాయికి వెళ్లిపోతుంది.

ఎర్రచందనం సిండికేట్‌లో అంతర్గత వ్యవహారాలను నుంచి వచ్చే పోటీని పుష్పరాజ్‌ ఎలా ఎదుర్కొంటాడన్న ఆసక్తితో ద్వితీయార్ధం చూడటం మొదలు పెట్టిన ప్రేక్షకుడికి నిరాశే ఎదురవుతుంది. తెరపై సన్నివేశాలు వస్తున్నా, కథ ముందుకు నడవదు. మధ్యలో శ్రీవల్లి ప్రేమ ప్రయాణం, పాటలు బాగున్నా, ఒక సీరియస్‌ మోడ్‌లో సాగుతున్న కథకు చిన్న  బ్రేక్‌లు వేసిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఈ క్రమంలోనే ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్‌గా ఫహద్‌ ఫాజిల్‌ పాత్ర పరిచయంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ఇక్కడి నుంచి పుష్పరాజ్‌- భన్వర్‌ సింగ్‌ల మధ్య పోటాపోటీ ఉంటుందని ఆశించినా ఆయా సన్నివేశాలన్నీ సాదాసీదాగా సాగుతుంటాయి. ఒక బలమైన ముగింపుతో తొలి పార్ట్‌ ముగుస్తుందని ఆశించిన ప్రేక్షకుడు పూర్తి తృప్తి చెందడు. పార్ట్‌-2 కోసం చాలా విషయాలను ప్రశ్నార్థకంగానే వదిలేసినట్లు అర్థమవుతుంది. మరో భాగం రావడానికి ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రేక్షకుడి మదిని తొలిచేసే ప్రశ్నతో ముగించి ఉంటే ఇంకాస్త బాగుండేది. అలాగే ద్రాక్షాయణి(అనసూయ), మంగళం శ్రీను(సునీల్‌), భన్వర్‌ సింగ్‌ షెకావత్‌లను మాత్రమే పుష్పరాజ్‌ ఎదుర్కొంటాడా? లేక ఇంకేవైనా కొత్త పాత్రలు వస్తాయా? అన్నది ‘పుష్ప: ది రూల్‌’లో చూడాల్సి ఉంటుంది.హోంఈనాడు హోం

చిత్రం: పుష్ప: ది రైజ్‌; నటీనటులు: అల్లు అర్జున్‌, రష్మిక, ఫహాద్‌ ఫాజిల్‌, సునీల్‌, ధనుంజయ, అనసూయ, రావు రమేశ్‌, అజయ్‌, అజయ్‌ ఘోష్‌ తదితరులు; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌; ఎడిటింగ్‌: కార్తీక్‌ శ్రీనివాసన్‌, రుబెన్‌; సినిమాటోగ్రఫీ: మిరోస్లా కూబా బ్రొజెక్‌; నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా; నిర్మాత: నవీన్‌ యెర్నేని, వై.రవి శంకర్‌; రచన, దర్శకత్వం: సుకుమార్‌; విడుదల: 17-12-2021.

అల్లు అర్జున్‌  సుకుమార్‌ కాంబినేషన్‌లో ‘ఆర్య’, ‘ఆర్య 2’ వచ్చాయి. ‘ఆర్య’ అదరగొట్టగా... ‘ఆర్య 2’ ఫర్వాలేదనిపించింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత హ్యాట్రిక్‌ మూవీ ప్రకటించగానే అందరిలోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక బన్నీని ఊర మాస్‌ లుక్‌లో ‘పుష్ప’  పరిచయం చేసిన తర్వాత ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. అల్లు అర్జున్‌ ఎర్రచందనం స్మగ్లర్‌గా నటించటం, రష్మిక  డీగ్లామర్‌ పాత్ర చేయటం, సునీల్‌, మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండటం ఆసక్తిని కలిగించింది. మరి ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘పుష్ప’ ఎలా ఉంది? పుష్పరాజ్‌గా మాస్‌ లుక్‌లో అల్లు అర్జున్‌ ఎలా నటించారు? అసలు ఈ సినిమా కథేంటి?

కథేంటంటే: పుష్ప అలియాస్ పుష్ప‌రాజ్ (అల్లు అర్జున్) ఓ కూలీ. ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌ని మ‌న‌స్త‌త్వం. అయిన‌వాళ్లు త‌న ఇంటి పేరు కూడా లాక్కోవ‌డంతో క‌సితో పెరుగుతాడు. కూలీ చేసే చోట కేశ‌వ అనే స్నేహితుడు క‌లిశాక పుష్ప ప్ర‌యాణ‌మే మారిపోతుంది. కూలీ నుంచి ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌రైన పుష్ప... ఆ తర్వాత కొండా రెడ్డి (అజ‌య్ ఘోష్‌) అత‌ని సోద‌రుల‌కి స్మగ్లింగ్‌లో ఉపాయాలు చెప్పే స్థాయికి ఎదుగుతాడు. ఆ త‌ర్వాత ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లర్‌ల సిండికేట్‌లో ఓ భాగ‌స్వామిగా, త‌ర్వాత సిండికేట్‌నే శాసించే స్థాయికి చేరుకుంటాడు. అప్పటివరకు ఆ స్థాయిలో ఉన్న మంగ‌ళం శ్రీను (సునీల్‌)కి కంట‌గింపుగా మారుతుంది. అపాయ‌క‌ర‌మైన మంగ‌ళం శ్రీను, కొండా రెడ్డి బ్ర‌ద‌ర్స్‌తో శ‌త్రుత్వం పెంచుకున్న పుష్ప‌కి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? శ్రీవ‌ల్లి (ర‌ష్మిక‌)ని ప్రేమించిన పుష్ప ఆమెని పెళ్లాడాడా లేదా?కొత్త‌గా వ‌చ్చిన ఎస్పీ భన్వ‌ర్‌ సింగ్ షెకావ‌త్ (ఫహాద్ ఫాజిల్‌)తో పుష్ప‌కి ఎలాంటి స‌వాళ్లు ఎదురయ్యాయ‌న్న‌ది తెలియాలంటే ‘పుష్ప: ది రైజ్‌’  చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఇప్పటివరకూ వివిధ మాఫియాల నేపథ్యంలో వందల కథలను దర్శకులు వెండితెరపై చూపించారు. హవాలా, డ్రగ్స్‌, ఆయుధాలు, మనుషుల అక్రమ రవాణా. ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతిదీ ఒక సబ్జెక్ట్‌ అవుతుంది. ‘పుష్ప’ కోసం దర్శకుడు సుకుమార్‌ ‘ఎర్రచందనం’ స్మగ్లింగ్‌ నేపథ్యాన్ని, మాస్‌లో మంచి క్రేజ్‌ ఉన్న అల్లు అర్జున్‌ని కథానాయకుడిగా ఎంచుకున్నాడు. ఈ పాయింటే ‘పుష్ప’పై అంచనాలు ఏర్పడేలా చేసింది. అందుకు తగినట్లుగానే ప్రేక్షకులను మెప్పించేలా కథ, కథనాలను తీర్చిదిద్దడంలో సుకుమార్‌ కొంతవరకు సఫలమయ్యాడు. ఎర్ర‌చంద‌నం ఎంత విలువైందో, అది మ‌న శేషాచ‌లం అడ‌వుల నుంచి జ‌పాన్ వ‌ర‌కు ఎలా ప్ర‌యాణం చేస్తుందో చెబుతూ ఆరంభ స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు సుకుమార్‌. ఆ ఎపిసోడ్ ప‌క్కాగా ఆయ‌న మార్క్‌తో ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. ఆ త‌ర్వాత పుష్ప ప్ర‌యాణం మొద‌ల‌వుతుంది. ప్ర‌థ‌మార్ధంలో హీరో నేప‌థ్యాన్ని, త‌న తండ్రి చ‌నిపోయాక ప‌రిస్థితులు మాత్రం కొంచెం భావోద్వేగాలు పంచుతాయి. ఆ తర్వాత ఎర్రచందనం రవాణా, సిండికేట్‌ తదితర వ్యవహారాలతో కథను ముందుకు నడిపిన దర్శకుడు ఆసక్తి కలిగించేలా ఆయా సన్నివేశాలను గ్రాండ్‌ లుక్‌తో తెరపై చూపించాడు. ప్రతి సన్నివేశం కథానాయకుడి పాత్రను ఎలివేట్‌ చేసేలా తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా బన్నీ అభిమానులకు కనులపండుగగా ఉంటుంది. ఒకవైపు పుష్పరాజ్‌ ప్రయాణాన్ని చూపిస్తూనే, మరోవైపు సిండికేట్‌ వెనుక ఉన్న అసలు పాత్రలను పరిచయం చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచాడు దర్శకుడు. పుష్పరాజ్‌ కూలీ నుంచి సిండికేట్‌ నాయకుడిగా అడుగులు వేయడానికి దోహద పడేందుకు అవసరమైన బలమైన సన్నివేశాలు తెరపై చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. విరామం ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. దీంతో ‘పుష్ప’ పాత్ర పతాక స్థాయికి వెళ్లిపోతుంది.

ఎర్రచందనం సిండికేట్‌లో అంతర్గత వ్యవహారాలను నుంచి వచ్చే పోటీని పుష్పరాజ్‌ ఎలా ఎదుర్కొంటాడన్న ఆసక్తితో ద్వితీయార్ధం చూడటం మొదలు పెట్టిన ప్రేక్షకుడికి నిరాశే ఎదురవుతుంది. తెరపై సన్నివేశాలు వస్తున్నా, కథ ముందుకు నడవదు. మధ్యలో శ్రీవల్లి ప్రేమ ప్రయాణం, పాటలు బాగున్నా, ఒక సీరియస్‌ మోడ్‌లో సాగుతున్న కథకు చిన్న  బ్రేక్‌లు వేసిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఈ క్రమంలోనే ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్‌గా ఫహద్‌ ఫాజిల్‌ పాత్ర పరిచయంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ఇక్కడి నుంచి పుష్పరాజ్‌- భన్వర్‌ సింగ్‌ల మధ్య పోటాపోటీ ఉంటుందని ఆశించినా ఆయా సన్నివేశాలన్నీ సాదాసీదాగా సాగుతుంటాయి. ఒక బలమైన ముగింపుతో తొలి పార్ట్‌ ముగుస్తుందని ఆశించిన ప్రేక్షకుడు పూర్తి తృప్తి చెందడు. పార్ట్‌-2 కోసం చాలా విషయాలను ప్రశ్నార్థకంగానే వదిలేసినట్లు అర్థమవుతుంది. మరో భాగం రావడానికి ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రేక్షకుడి మదిని తొలిచేసే ప్రశ్నతో ముగించి ఉంటే ఇంకాస్త బాగుండేది. అలాగే ద్రాక్షాయణి(అనసూయ), మంగళం శ్రీను(సునీల్‌), భన్వర్‌ సింగ్‌ షెకావత్‌లను మాత్రమే పుష్పరాజ్‌ ఎదుర్కొంటాడా? లేక ఇంకేవైనా కొత్త పాత్రలు వస్తాయా? అన్నది ‘పుష్ప: ది రూల్‌’లో చూడాల్సి ఉంటుంది.

ఎవరెలా చేశారంటే: ‘పుష్ప: ది రైజ్‌’ అల్లు అర్జున్‌ వన్‌ మ్యాన్‌ షో అని చెప్పవచ్చు. కథ మొదలైన దగ్గరి నుంచి పుష్పరాజ్‌ పాత్రను ఎలివేట్‌ చేస్తూ తెరకెక్కించిన సన్నివేశాలు అద్భుతంగా అలరిస్తాయి. మాస్‌ లుక్‌లోనే కాదు నటనలోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టేశాడు. ఏ సన్నివేశం చూసినా ‘తగ్గేదేలే’ అంటూ ఫ్యాన్స్‌తో విజిల్స్‌ వేయించాడు. చిత్తూరు యాసలో బన్నీ పలికిన సంభాషణలు అలరిస్తాయి. శ్రీవల్లిగా డీగ్లామర్‌ పాత్రలో రష్మిక నటన సహజంగా ఉంది. కమెడియన్‌గా ప్రేక్షకులకు సుపరిచితమైన సునీల్‌ ఇందులో ప్రతినాయకుడు మంగళం శ్రీను పాత్రలో నటించాడు. ఈ పాత్ర కోసం సునీల్‌ మారిన తీరు, ఆయన డిక్షన్‌ బాగున్నాయి. ప్రీరిలీజ్‌ వేడుకలో చెప్పినట్లు ఈ సినిమాలో కొత్త సునీల్‌ను ప్రేక్షకులు చూస్తారు. అనసూయ, అజయ్‌ ఘోష్‌, రావు రమేశ్‌, ధనుంజయ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. పోలీస్‌ ఆఫీసర్‌ భన్వర్‌ సింగ్‌గా ఫహద్‌ ఫాజిల్‌ పాత్రద్వితీయార్ధంలోనే వస్తుంది. ఈ భాగంలో బలమైన సన్నివేశాలు పడలేదు. బహుశా పార్ట్‌-2 ‘పుష్ప: ది రూల్‌’లో ఈ పాత్రతోనే పుష్పరాజ్‌ ఢీకొట్టాల్సి ఉంటుందని హింట్‌ మాత్రం ఇచ్చారు. సమంత ఐటమ్‌ సాంగ్‌ మాస్ ప్రేక్షకులతో విజిల్స్‌ వేయిస్తుంది.

 సాంకేతికంగా ‘పుష్ప’ మరో లెవల్‌లో ఉంది. సినిమాటోగ్రాఫర్‌ కూబా గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి సన్నివేశాన్ని రిచ్‌ లుక్‌లో చూపిస్తూనే, వాస్తవాన్ని ప్రతిబింబించేలా చూపించారు. యాక్షన్‌ సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. ఇక ఈ సినిమాకు ఇద్దరు ఎడిటర్లు పనిచేశారు. అయితే నిడివి మాత్రం పెరిగిందేమోననిపిస్తుంది. కొన్ని సన్నివేశాలకు కత్తెర వేసి ఉంటే ఇంకాస్త బాగుండేది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు బాగున్నాయి. ‘సామి.’, ‘ఊ అంటావా.’, ‘ఏ బిడ్డా.’, ‘చూపే బంగారమాయెనే.’ పాటలు తెరపైనా అలరించేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం ఓకే. ఈ విషయంలో చిత్రబృందం ఇంకాస్త దృష్టి పెట్టి ఉండాల్సింది. అడవి వాతావరణం చూపించడానికి ప్రొడక్షన్‌ డిజైనర్లు, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పడిన కష్టం తెరపై ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. రామకృష్ణ, మౌనిక ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్లారు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఎక్కడా ‘తగ్గేదేలే’ అన్న స్థాయిలో సినిమా కోసం ఖర్చు పెట్టారు. తనదైన మార్క్‌ కథలతో ప్రేక్షకులను అలరించే దర్శకుడు సుకుమార్‌ ‘రంగస్థలం’ తర్వాత మరో మాస్‌ కథను ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశారు. పుష్పరాజ్‌ పాత్రతో సహా మిగిలిన పాత్రలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ముఖ్యంగా కథానాయకుడి పాత్రను ఎలివేట్‌ చేసిన విధానం, అందుకు తగిన సన్నివేశాలు మెప్పిస్తాయి. నిడివి విషయంలో సుకుమార్‌ ఇంకాస్త ఆలోచించి ఉంటే బాగుండేది. ప్రథమార్ధం పరుగులు పెట్టగా, ద్వితీయార్ధం నెమ్మదిగా సాగుతుంది. సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌కు ఇంకాస్త సమయం తీసుకొని ఉంటే. ‘పుష్ప: ది రైజ్‌’ మరో స్థాయిలో ఉండేదేమో!

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author