Top:Punjagutta Steel Bridge: గురువారం నుంచి అందుబాటులోకి రానున్న పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి! ...చిత్రాలు

 Steel Bridge: గురువారం నుంచి అందుబాటులోకి రానున్న పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి! ...చిత్రాలు

హైదరాబాద్ మహానగర ట్రాఫిక్ కష్టాలు మెల్లమెల్లగా మెరుగుపడుతున్నాయి. సిగ్నల్ ఫ్రీ సిటీగా రూపుదిద్దుకుంటున్న భాగ్యనగరంలో ఫ్లైఓవర్ బ్రిడ్జిలను శరవేగంగా నిర్మిస్తోంది తెలంగాణ సర్కార్/

హైదరాబాద్ మహానగర ట్రాఫిక్ కష్టాలు మెల్లమెల్లగా మెరుగుపడుతున్నాయి. సిగ్నల్ ఫ్రీ సిటీగా రూపుదిద్దుకుంటున్న భాగ్యనగరంలో ఫ్లైఓవర్ బ్రిడ్జిలను శరవేగంగా నిర్మిస్తోంది తెలంగాణ సర్కార్ ఇందులో భాగంగా హైదరాబాద్ పంజాగుట్ట సమీపంలో మరో స్టీల్ బ్రిడ్జిని నిర్మించింది. నిర్మాణ పనులు పూర్తి కావడంతో జనవరి 20 గురువారం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది.

పంజాగుట్ట గ్రేవ్ యార్డ్ పాత ముఖద్వారాన్ని తొలగించి నిర్మించిన కొత్త కేబుల్ బ్రిడ్జి వలన స్మశానవాటికకు వెళ్లేందుకు ఇబ్బందులు తొలగి పోతున్నాయి. నాగార్జున సర్కిల్ నుండి కె.బి.అర్ పార్క్ జంక్షన్ కు వెళ్లే వాహనాలు ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా నేరుగా వెళ్లేందుకు వీలు కానుంది.

పంజాగుట్ట గ్రేవ్ యార్డ్ వెళ్లేందుకు ప్రజలు ఇబ్బంది తో పాటుగా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం అవ్వడంతో జిహెచ్ఎంసి శాశ్వత పరిష్కారం చేయుటకు రూ. 17 కోట్ల వ్యయంతో స్టీల్ బ్రిడ్జి, పాత గేట్ నుండి హెచ్.టి లైన్ వరకు రోడ్డు విస్తరణ చేపట్టింది జీహెచ్‌ఎంసీ.

హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులను కల్పించాలనే లక్ష్యంతో జిహెచ్ఎంసి విశేష కృషి చేస్తున్నది. తద్వారా ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా ప్రజల అవసరాలు తీరుతున్నాయి. మొత్తం రోడ్డు విస్తీర్ణం 140 మీటర్లు కాగా అందులో అప్రోచ్ రిటర్నింగ్ వాల్ 57 మీటర్లు, 9.6 మీటర్ల ఫ్లైఓవర్ మొత్తం 46 స్టీల్ గ్రీడర్స్ ఏర్పాటు చేసి పనులను పూర్తి చేశారు.

ఈ బ్రిడ్జిని గురువారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించనున్నారు.

హైదరాబాద్ పంజాగుట్ట సమీపంలో మరో స్టీల్ బ్రిడ్జిని నిర్మించింది.బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 1/3లోని పంజగుట్ట శ్మశాన వాటిక పాత ద్వారాన్ని తొలగించి నూతన కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణంతో శ్మశాన వాటికకు వెళ్లేందుకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. పాత గేటు నుంచి హైటెన్షన్‌ విద్యుత్‌ పోల్‌ వరకు చేసిన విస్తరణతో నాగార్జున సర్కిల్‌ నుంచి కేబీఆర్‌ పార్కు జంక్షన్‌కు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నం కాకుండా ఉంటుంది.  గ్రేవియార్డ్‌కు వెళ్లేందుకు ఇబ్బందులు తీరుతాయి.

ఇందుకోసం జీహెచ్‌ఎంసీ రూ.17 కోట్లు మంజూరు చేసింది. కేబుల్‌ బ్రిడ్జి, పాత గేటు నుంచి హెచ్‌టీ లైన్‌ వరకు రోడ్డును విస్తరించడంతో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైంది. ఈ బ్రిడ్జిని గురువారం ఉదయం 10 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించనున్నారు. 

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు గానూ కీలక మార్పులు తీసుకొస్తుంది. అందులో భాగంగానే పంజాగుట్ట వద్ద స్టీల్ బ్రిడ్జ్ ను ఏర్పాటు చేసింది. ఎప్పుడూ రద్దీగా కనిపించే పంజాగుట్ట వద్ద ఈ రెడీ అయిన ఈ బ్రిడ్జ్ ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇప్పటికే బంజారాహిల్స్ రోడ్ నెం.3 నుంచి పంజాగుట్ట వైపుకు ఒక స్టీల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయగా ఇది రెండోది.

రోడ్ విస్తరించడంతో పలు బిజీ లొకేషన్లకు లింకింగ్ గా మారింది. ప్రధానంగా సిటీ కమర్షియల్ సెంటర్లను కలిపింది. పర్యావసానంగా ట్రాఫిక్ రద్దీ కూడా పెరిగింది. మొదటి బ్రిడ్జ్ లాగే రెండో బ్రిడ్జ్ కూడా స్మూత్ అండ్ స్టడీ కదలికలకు కారణమవుతుందని భావిస్తున్నారు.

ఈ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.17కోట్లు కేటాయించగా స్థలం కోసమే రూ.6కోట్ల వరకూ ఖర్చు అయింది. మొత్తం బ్రిడ్జ్ పొడవు 140మీటర్లు. అందులో స్టీల్ బ్రిడ్జ్ భాగం 83మీటర్లు కాగా మిగతాది 57మీటర్లు.

ఈ సౌకర్యం నాగర్జున సర్కిల్ నుంచి కేబీఆర్ పార్క్ జంక్షన్ వరకూ అందుబాటులో ఉండటంతో ట్రాఫిక్ తగ్గి స్మశాన వాటక ప్రదేశంలో ఇబ్బంది లేకుండా మారింది. ప్రజల సెంటిమెంట్లు దృష్టిలో పెట్టుకుని నిర్మించిన బ్రిడ్జ్... సమాధుల వద్ద జరిపే ప్రార్థనలకు ఎటువంటి ఆటంకాన్ని కలుగజేయదు.

వీటితో పాటు మరో స్టీల్ బ్రిడ్జ్ ఏర్పాటుకు అధికారులు ప్రణాళిక వేస్తున్నారు. జలగాం వెంగళరావు పార్క్ రోడ్ నుంచి స్మశానం వరకూ దీని నిర్మాణం చేపడతారు. స్థల సమీకరణపై చర్చలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఈ సౌకర్యం నాగర్జున సర్కిల్ నుంచి కేబీఆర్ పార్క్ జంక్షన్ వరకూ అందుబాటులో ఉండటంతో ట్రాఫిక్ తగ్గి స్మశాన వాటక ప్రదేశంలో ఇబ్బంది లేకుండా మారింది. ప్రజల సెంటిమెంట్లు దృష్టిలో పెట్టుకుని నిర్మించిన బ్రిడ్జ్... సమాధుల వద్ద జరిపే ప్రార్థనలకు ఎటువంటి ఆటంకాన్ని కలుగజేయదు.

వీటితో పాటు మరో స్టీల్ బ్రిడ్జ్ ఏర్పాటుకు అధికారులు ప్రణాళిక వేస్తున్నారు. జలగాం వెంగళరావు పార్క్ రోడ్ నుంచి స్మశానం వరకూ దీని నిర్మాణం చేపడతారు. స్థల సమీకరణపై చర్చలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.స్థల సమీకరణపై చర్చలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. స్థల సమీకరణపై చర్చలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.ఈ సౌకర్యం నాగర్జున సర్కిల్ నుంచి కేబీఆర్ పార్క్ జంక్షన్ వరకూ అందుబాటులో ఉండటంతో ట్రాఫిక్ తగ్గి స్మశాన వాటక ప్రదేశంలో ఇబ్బంది లేకుండా మారింది. ప్రజల సెంటిమెంట్లు దృష్టిలో పెట్టుకుని నిర్మించిన బ్రిడ్జ్... సమాధుల వద్ద జరిపే ప్రార్థనలకు ఎటువంటి ఆటంకాన్ని కలుగజేయదు. 

వీటితో పాటు మరో స్టీల్ బ్రిడ్జ్ ఏర్పాటుకు అధికారులు ప్రణాళిక వేస్తున్నారు. జలగాం వెంగళరావు పార్క్ రోడ్ నుంచి స్మశానం వరకూ దీని నిర్మాణం చేపడతారు. స్థల సమీకరణపై చర్చలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.స్థల సమీకరణపై చర్చలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. స్థల సమీకరణపై చర్చలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author