TOP : Bigg boss telugu 5: డబ్బులు వద్దనుకున్నారు.. మానస్‌ ఎలిమినేట్‌ అయ్యాడు.

 హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-5 నుంచి మానస్‌  ఎలిమినేట్‌ అయ్యాడు. బిగ్‌బాస్‌ సీజన్‌-5 ఫినాలే సందర్భంగా ‘శ్యామ్‌ సింగరాయ్‌’ టీమ్‌ నాని, సాయి పల్లవి, కృతిశెట్టి వచ్చి హౌస్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా హౌస్‌లోకి వెళ్లిన వీళ్లు టాప్‌-4లో ఉన్న నలుగురికి డబ్బులు ఆఫర్‌ చేశారు. ‘ఇప్పుడు. ఈ సమయంలో ఎవరైనా ఈ సూట్‌కేస్‌లో ఉన్న డబ్బు కావాలనుకుంటే తీసుకుని వెళ్లిపోవచ్చు’ అని నాని ఆఫర్‌ ఇవ్వగా, నలుగురూ తిరస్కరించారు. రెండోసారి కూడా ఆఫర్‌ ఇస్తానని నాగార్జున ప్రకటించినా తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. అనంతరం జరిగిన ఎలిమినేషన్‌లో మానస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చాడు.ఈ సందర్భంగా వేదికపైకి వచ్చిన మానస్‌ మాట్లాడుతూ. ‘‘జర్నీ అద్భుతంగా ఉంది. హౌస్‌మేట్స్‌ హృదయాలను గెలుచుకున్నా. మనకు ఎంత ఓపికున్నా తక్కువేనని ఇక్కడ నేర్చుకున్నా. బిగ్‌బాస్‌ సీజన్‌-5 టైటిల్‌ గెలుచుకోవాలన్న ఫైర్‌ సన్నీలో ఎక్కువగా ఉంది. ఇన్ని రోజులు జర్నీ చేశాడు కాబట్టి కచ్చితంగా ప్రేక్షకుల మనసును గెలుచుకుని ఉంటాడు. ఎవరి స్టైల్‌లో వాళ్లు ప్రయత్నించారు. ఎవరు టైటిల్‌ గెలిచినా మేమంతా ఏదో ఒకటి సాధించాం. ఇంత దూరం వచ్చామంటే మాలో ఏదో ఒక పాయింట్‌ ప్రేక్షకులకు నచ్చే ఉంటుంది. ఎవరు ఎక్కువ నచ్చితే వాడే విన్నర్‌’’ అని సమాధానం ఇచ్చాడు.

 ఇంటర్నెట్‌డెస్క్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-5. విజేతగా నటుడు వీజే సన్నీ(sunny) నిలిచాడు. బిగ్‌బాస్‌ ట్రోఫీతో పాటు రూ.50లక్షల ప్రైజ్‌ మనీ, సువర్ణభూమి వాళ్లు అందించే రూ.25 లక్షల విలువైన ప్లాట్‌ (300 square yards), టీవీఎస్‌ అపాచీ బైక్‌ సొంతం చేసుకున్నాడు. సినీతారల సందడితో బిగ్‌బాస్‌-5 గ్రాండ్‌ ఫినాలే అట్టహాసంగా జరిగింది. టాప్‌-5లో సన్నీతో పాటు షణ్ముఖ్‌, మానస్‌, శ్రీరామచంద్ర, సిరి నిలవగా. ఓటింగ్‌లో వాళ్లను వెనక్కి నెట్టి ఈ సీజన్‌ విజేతగా సన్నీ అవతరించాడు. 105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్‌-5లో మొత్తం 19మంది కంటెస్టెంట్‌లు పాల్గొనగా తన ఆట తీరు మెప్పించి, ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల హృదయాలను గెలచుకున్నాడు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఫినాలేలో మొదట సిరి, మానస్‌, శ్రీరామచంద్ర ఎలిమినేట్‌ అవ్వగా. చివరికు సన్నీ, షణ్ముఖ్‌ నిలిచారు. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన కౌంట్‌డౌన్‌లో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని అత్యధిక ఓట్లు సంపాదించిన వీజే సన్నీ(VJ Sunny) విజేతగా నిలిచినట్లు నాగార్జున ప్రకటించారు. రన్నర్‌గా నిలిచిన షణ్ముఖ్‌కు కూడా సువర్ణ భూమి కుటీర్‌ నుంచి మంచి బహుమతి ఉంటుందని ప్రకటించారు.

ఈ సందర్భంగా విజేత వీజే సన్నీ మాట్లాడుతూ. ‘‘ఓటు వేసి గెలిపించిన అందరికీ ధన్యవాదాలు. నాతో పాటు జర్నీ చేసిన 19మంది కంటెస్టెంట్‌లను ఎప్పటికీ మర్చిపోలేను. నా వల్ల అయినంత వరకూ ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఉంటా. నేను కప్పు గెలుచుకోవడంలో నాగార్జున గారి మోటివేషన్‌, స్నేహితుల సహకారం, మా అమ్మ ప్రోత్సాహం మర్చిపోలేను. మా అమ్మ అడిగిన మొదటి గిఫ్ట్‌. ఆమెకు ఇచ్చేస్తున్నా’’ అని సన్నీ చెప్పుకొచ్చాడు. ఇక రన్నరప్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ మాట్లాడుతూ. ‘‘ గెలుపు ముఖ్యం కాదు. ఆట ఎలా ఆడమన్నదే ముఖ్యం. నేను అదే నమ్ముతాను. కప్పు ఈ రోజు కాకుంటే రేపు. అమ్మానాన్న ఇక్కడి వరకు వచ్చారు. వాళ్లను ఇక్కడి వరకు తీసుకొచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నాడు. ఇక కొత్త సంవత్సరంలో రెండు నెలలు కాగానే ‘బిగ్‌బాస్‌ సీజన్‌-6’ ప్రారంభం కానున్నట్లు ఈ సందర్భంగా నాగార్జున ప్రకటించారు.ఇంటర్నెట్‌డెస్క్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-5. విజేతగా నటుడు వీజే సన్నీ(sunny) నిలిచాడు. బిగ్‌బాస్‌ ట్రోఫీతో పాటు రూ.50లక్షల ప్రైజ్‌ మనీ, సువర్ణభూమి వాళ్లు అందించే రూ.25 లక్షల విలువైన ప్లాట్‌ (300 square yards), టీవీఎస్‌ అపాచీ బైక్‌ సొంతం చేసుకున్నాడు. సినీతారల సందడితో బిగ్‌బాస్‌-5 గ్రాండ్‌ ఫినాలే అట్టహాసంగా జరిగింది. టాప్‌-5లో సన్నీతో పాటు షణ్ముఖ్‌, మానస్‌, శ్రీరామచంద్ర, సిరి నిలవగా. ఓటింగ్‌లో వాళ్లను వెనక్కి నెట్టి ఈ సీజన్‌ విజేతగా సన్నీ అవతరించాడు. 105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్‌-5లో మొత్తం 19మంది కంటెస్టెంట్‌లు పాల్గొనగా తన ఆట తీరు మెప్పించి, ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల హృదయాలను గెలచుకున్నాడు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఫినాలేలో మొదట సిరి, మానస్‌, శ్రీరామచంద్ర ఎలిమినేట్‌ అవ్వగా. 

బిగ్ బాస్’ సీజన్ 5లో విజేతగా నిలిచినందుకు. వీజే సన్నీకి రూ.50 లక్షల క్యాష్‌తోపాటు. షాద్ నగర్‌లోని సువర్ణ కుటీర్‌లో రూ.25 లక్షలు విలువ చేసే 300 చదరపు గజాల ప్లాట్‌ను గెలుచుకున్నాడు. దానితోపాటు టీవీఎస్ బైక్ లభిస్తుందని నాగార్జున ప్రకటించారు. అలాగే. బిగ్ బాస్ రన్నరప్‌ షన్ముఖ్ జస్వంత్‌కు కూడా సువర్ణ కుటీర్‌లో ప్లాట్ ఇచ్చేందుకు స్పాన్సర్లు ముందుకొచ్చారు. ‘బిగ్ బాస్’ సీజన్-4లో మూడో స్థానంలో నిలిచిన సోహెల్ డబ్బుతో ఇంటి నుంచి బయటకు రావడం, రెండో స్థానంలో ఉన్న అఖిల్ ఒట్టి చేతులతో తిరిగి వెళ్లడంతో అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హోస్ట్ నాగార్జున స్పాన్సర్ల ద్వారా షన్ను కూడా న్యాయం జరిగేలా చేశారు. మరి, షన్ను అభిమానులు సన్నీ విజయాన్ని స్వాగతిస్తారో లేదో చూడాలి.

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author