Top :గౌడ కుల అభ్యున్నతే లక్ష్యంగా ఆవిర్భవించిన గౌడ విద్యావంతుల వేదిక-(GVV)....

గౌడ కుల అభ్యున్నతే లక్ష్యంగా ఆవిర్భవించిన గౌడ విద్యావంతుల వేదిక...

గౌడ కులస్థుల సమస్యలపై, గౌడ కుల పేదరిక నిర్మూలనపై, గౌడ కుల ఆస్తులపై, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరా ప్రాజెక్టుపై, నిరుపేద గౌడ విద్యార్థుల సమస్యలపై, గౌడ హాస్టల్ పై, గౌడ ఆత్మగౌరవ ఆస్తిపై..... ఇలా మొదలగు అంశాలపైన ఈరోజు చర్చించి సమస్య పరిష్కార విధి విధానాలపై ఒక కార్యాచరణ రూపొందించడం చాలా సంతోషంగా ఉంది. 

ఇన్నాళ్లు మేధావి వర్గం బయటకు రావట్లేదు ఇగ నా కులానికి దిక్కెవరు అనుకునే తరుణంలో మేము సైతం అంటూ ముందుకు వచ్చి ఒక వేదికను ఏర్పాటు చేసిన ఆత్మీయులకు ముందుగా శిరస్సువంచి నమస్కరిస్తున్న...

దునియాలో గిన్ని కులాలు ఉన్నప్పటికీ అన్ని సమస్యలు ఒక్క గౌడ కులానికే ఎందుకో అర్థం కాదు. అందరు అంటుంటరు కులం కూడువెడ్తదా అని., అవును మాకు కులమే కూడు వెడ్తది. కాని ఏ కులంలో ఐనా ఎవరికి వారు వాళ్ల కులవృత్తి శేస్కబత్కుతరు కాని ఒక్క మా కులంలో మాత్రమే మేమ్ బత్కడంతో పాటు ప్రభుత్వాన్ని కూడా నడుపుతున్నం. ఏ కులానికి లేని ఒక క్యాబినేట్ శాఖ(ఎక్సైజ్ శాఖ) కేవలం మా కులానికే ఎందుకు అన్నది పెద్ద ప్రశ్న. అందరు అంటుంటారు మీ గౌండ్లోల్లకు ఏంది మందుకల్లు పైసల్ మస్తుగున్నయి అని కాని నిజంగా ఏ నిరుపేద గీతవృత్తిదారుడు కూడా మందు కల్లు అమ్మి ఒక అమాయక ప్రణం తీయడానికి కారకుడు కావాలని అనుకోడు. కేవలం కద్దరు బట్టలు ఏస్కోని ఐద్రవాద్ల కల్లు కాంపోండ్లు నడ్పుతున్న మాఫియా కోసమే ప్రభుత్వ శాఖలు అందుకు కారణం. నిజానికి చెట్టుకల్లు(నీరా) ప్రకృతి పానియం అని, సర్వరోగాలు నయం చేసే గుణాలు నీరాలో ఉన్నాయని దునియాకే తెలుసు., ఇప్పటికీ చెట్టుకల్లును పత్యానికి వాడడం విశేషం కాని హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో స్వచ్చమైన కల్లు దొరకడం కష్టం అందుకు కారణం కద్దర్ బట్టలోల్లే.

నిరుపేద విద్యార్థులు చదువుకునేందుకు ఆనాటి కొంతమంది గౌడ పెద్దలు భవిష్యత్ తరాలను ఉద్దేశించి గౌడ హాస్టళ్ ను నిర్మించిపెడ్తే అక్కడ కూడా రాజకీయం చేసి ఆ ఆస్తిని కుదవెట్టే స్థాయికి దిగజారిండ్రు ఈ కద్దర్ బట్టల లుచ్చలు. నేడు ఒక నిరుపేద విద్యార్థి ప్రతిభ ఉండి చదువుకుందం అని అనుకున్నా కూడా తన ఆర్థిక పరిస్థితి సహకరించక మధ్యలోనే చదువు మానేసి ఏదో ఒక కొల్వుచేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న పరిస్థితి కాని ఇవన్నీ ఈ హాస్టళ్ పెద్దలకు కాని, కుల పెద్దలకు కాని, రాజకీయ నాయకులకు కాని పట్టవు ఎందుకంటే వాడు చదువుకొని మేధావి ఐతే వీళ్లను ప్రశ్నిస్థడు కాబట్టి.

అన్నీ కులాలు ఆత్మగౌరవంతో బత్కాలి అని తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంక రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కులానికి ఆత్మగౌరవ భవనాల పేరుతో రాజధాని నడిబొడ్డున స్థలాలను కేటాయిస్తే వాటిని కూడా ఖబ్జా చేస్కొని వాళ్ల కుటుంబ భవిష్యత్ తరాలకు చెందేవిధంగా రూపకల్పన చేయడం సిగ్గుచేటు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అనే వ్యక్తి కాదు ఒక శక్తి. ఆయనే మొట్టమొదట బహుజన రాజ్యం కావాలని అన్ని కులాలను ఏకం చేస్తూ బహుజన దండోరాను మోగించిండు కాని కొంతమంది మందిండ్లుల్ల సంసారం చేసే లుచ్చలు ఆయన్ను కేవలం ఒక కులానికే పరిమితం చేసి విగ్రహాల రూపంలో రూపకల్పన చేసిండ్రు కాని ఆయన విగ్రహం ఉండాల్సింది గల్లీలో కాదు ఢిల్లీ ఎర్రకోటపై, గోల్కొండ కోటపై., ఎందుకంటే సందర్శకులు చూసి ఆయన చరిత్ర తెలుసుకోవాలి. లండన్ యూనివర్సిటీలో కూడా ఆయన చరిత్ర ఉంది కాని మన యోధుడి చరిత్ర మనకు తెలియకపోవడం సిగ్గుచేటు.

ఇగ నీరా ప్రాజెక్టు., తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వందల కోట్ల నీరా ప్రాజెక్టు కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం అయ్యింది. నీరా ప్రాజెక్టు కావాలంటే ముందు తాటి ఈత వనాలు కావాలి. ఈ తాటి ఈత వనాలు పెరిగి పెద్దగయ్యి గీతకు రావడానికి కనీసం ఐదు నుండి ఏడు సంవత్సరాలు పడ్తుంది కాని చెట్ల పెంపకంపై దృష్టి పెట్టకుండా ముందు నీరా భవన్ పేరుతో హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో ఏండ్ల క్రితమే భూమి పూజ చేసిండ్రు అది కూడా పేపర్లకే పరిమితమైంది. ఇప్పుడు నీరా కావాలి అంటే బిల్డింగ్ రెడీ ఐనంక చెట్లు లేకుంటే ఏడ్కెంచి తీస్కొస్తరు అన్నదే ప్రధాన సమస్య. ముందు కావాల్సిన చెట్లను వద్లేసి కాంట్రాక్టుల లాభార్జన కోసం కులమని, నీరా అని గౌడ కులస్థులను మభ్యపెట్టి క్యాష్ చేస్కుంటుండ్రు ఈ కల్లు కాంపౌండ్ల కద్దర్ బట్టల పెద్దమన్షులు.

ఇలా ఒకటి రెండు కాదు ప్రతీ సమస్య పరిష్కారమే ధ్యేయంగా, గౌడ నిరుపేద నిర్మూలనే అంతిమ లక్ష్యంగా ఏర్పడింది మా ఈ #గౌడ_విద్యావంతుల_వేదిక. ఈ వేదికలో రిటైర్డ్ ప్రొఫేసర్లు, ప్రభుత్వ సలహాదారులు, డాక్టర్లు, ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు ఉండడం విశేషం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థ సేవ కోసం ముందుకొచ్చిన మేధావి వర్గంపై మీ ఆశిస్సులు ఉంచాలని కోరుకుంటూ...

ఇలా ఒకటి రెండు కాదు ప్రతీ సమస్య పరిష్కారమే ధ్యేయంగా, గౌడ నిరుపేద నిర్మూలనే అంతిమ లక్ష్యంగా ఏర్పడింది మా ఈ #గౌడ_విద్యావంతుల_వేదిక. ఈ వేదికలో రిటైర్డ్ ప్రొఫేసర్లు, ప్రభుత్వ సలహాదారులు, డాక్టర్లు, ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు ఉండడం విశేషం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థ సేవ కోసం ముందుకొచ్చిన మేధావి వర్గంపై మీ ఆశిస్సులు ఉంచాలని కోరుకుంటూ...

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author