TOP : కోడి.

కోడి లేదా కుక్కుటము ఒక రకమైన పక్షులు. వీటిలో మగ కోడిని 'కోడిపుంజు', ఆడ కోడిని 'కోడిపెట్ట' అని వ్యవహరిస్తారు. కోళ్ళల్లో అనేక రకాల జాతులు ఉన్నాయి. అవి. 

నాటు కోళ్ళు;ఇళ్ళలో పెంచు దేశివాళి రకాలు.గుడ్లు పెట్టుటకై తప్పని సరిగా మగకోడితో సంపర్కం అవసరం.నాటు/దేశివాళి కోడి గుడ్లు పునరుత్పత్తిశక్తి కలిగివుండును(గుడ్లను పొదగిన పిల్లలు వచ్చును)

ఫారంకోళ్ళు=గుడ్ల ఉత్పత్తికై పెంచు సంకరజాతి కోళ్ళు.వయస్సుకువచ్చిన తరువాత మగకోడితో సంపర్కం అవసరం లేకుండ గుడ్లు పెట్టును.ఈ గుడ్లకు పునరుత్పత్తి శక్తి లేదు.

బ్రాయిలర్=ప్రత్యేకంగా మాంసం కై పెంచు కోళ్ళు.వీటి ఎముకలు చాలా మృదువుగా వుండును.

కోడిపుంజులు విశేషాలు :

వీటిని అధికంగా పందాలలో వాడుతుంటారు.

వీటికి పౌరుషం పెరిగేందుకు మిర్చి మొదలుకొని అనేక రకాల ఆహారం ప్రత్యేకంగా తినిపిస్తుంటారు.

వీటిని ఆంధ్ర ప్రాంతంలో నెమలి, డేగ, కోయిల, పరగ ఇంకా అనేక రకాల పేర్లతో పిలుస్తుంటారు.

 ఉపయోగాలు :

 వీటి మాంసం విరివిగా వాడుతుంటారు.

వీటి గుడ్లు అత్యధికంగా వాడు ఒక ఆహార పదార్థం.

 కోడి ముందా? గుడ్డు ముందా?

కోడి గుడ్డు ఏర్పడడంలో ఓవోస్లిడీడిన్ 17 (ఓసీ- 17) అనే ప్రొటీన్ గుడ్డు పెంకులో మాత్రమే కనిపిస్తుంది. కోడి దేహంలో కాల్షియం కార్బొనేట్ తయారవుతుంది.కోడిలోనే ఉత్పత్తి అయ్యే ఓసీ- 17 ప్రొటీన్ కాల్షియం కార్బొనేట్‌లోని సూక్ష్మ కణాల మధ్య రసాయన లంకె (క్లాంప్)లా ఏర్పడి వాటిని పట్టి ఉంచి, అవి కాల్షైట్ స్ఫటికాలుగా మారడానికి దోహదపడుతుంది. ఆ స్ఫటికాలకు కేంద్రకంగా మారి అవి తమంతతాముగా పెరగడానికి కూడా ప్రొటీన్ దోహదపడుతుంది. అవి ఒకసారి పెరగడం పూర్తయిన తరువాత ప్రొటీన్ అదృశ్యమవుతుంది. 24 గంటల్లోపే మరో గుడ్డును తయారు చేసే పనిలో పడుతుంది. 'గుడ్డు ఏర్పడటానికి అత్యంత కీలకమైన ఈ ప్రొటీన్ కోడిలోనే ఉంటుంది తప్ప, గుడ్డులో కనిపించదు'. గుడ్డు ఏర్పడాలంటే ఈ ప్రొటీన్ ఉండాలి. అంటే గుడ్డుకన్నా ముందు ఈ ప్రొటీన్ ఉత్పత్తి జరిగింది కాబట్టి ప్రొటీన్ ఉత్పత్తి జరగాలంటే కోడి ఉండాలి కనుక, గుడ్డు కన్నా కోడే ముందు పుట్టిందట.

కుక్కుట శాస్త్రము అనగా పందెం కోడిపుంజుల గురించి వ్రాయబడిన పంచాంగము. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలలో ఈ శాస్త్రాన్ని సంక్రాతి పండుగ సమయాల్లో కోడి పందెములు వేసేటప్పుడు చదువుతారు. కోడి పుంజుల సంరక్షణ, కోడి పుంజుల వర్గీకరణ, ఏ సమయాల్లో కోడి పందెము వేయాలి, కోడి జన్మ నక్షత్రము, కోడి జాతకము మొదలుగు విషయాలు ఈ శాస్త్రములో ఉండును. కుక్కుట శాస్త్రము గురించి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి.

ఇవి కూడా చూడండి :

 కోడి మాంసం :

 కోడి మాంసము లేదా చికెన్ ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రధాన మాంసాహార పదార్థము. పౌల్ట్రీ ఉత్పత్తులలో ప్రపంచమంతా వాడేది కోడిమాంసమే. సుమారు 600 బి.సి నుండి బాబిలోనియన్‌ ప్రజలు చికెన్‌ను వాడినట్లు ఆనవాలు ఉన్నాయి. దీని మాంసములో కొవ్వుపదార్ధము తక్కువగా ఉండి పోషకాలు, మాంసకృత్తులు దండిగా లభిస్తాయి. శారీరక పెరుగుదల, కండరాల పెరుగుదల, మెదడు, శరీర అవయవాలు ఆరోగ్యంగాను, సమర్ధవంతంగాను పనిచేయడానికి మాంసకృత్తులు చాలా అవసరం. పిండిపదార్థాల వల్ల శారీరకంగా కొంత మేరకు శక్తి కలుగుతున్నప్పటికీ శారీరక ఎదుగుదలకు కావలసిన మాంసకృత్తులు మాత్రం పిండిపదార్థాలలో కొంతవరకే ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ, సరి పడినంత మోతాదులో మాంసకృ త్తులు కలిగిన పదార్థాలను విధిగా తీసుకోవాలి. కోడిమాంసము మంచి పౌష్టికాహారము.

రకాలు. నాటుకోళ్ళు :

మన ఇళ్ళలో పెంచేవి. ఇవి ఎక్కువగా పల్లె ప్రాంతాలలో చూడవచ్చును.

 బాయిలర్ కోళ్ళు :

వ్యాపార రీత్యా హైబ్రిడ్ కోళ్ళను కోళ్ళ ఫారం లలో పెంచుతారు. ఇవి నాటుకోళ్ళంత రుచిగా ఉండవు.

గిన్నీ కోళ్ళు :

ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి. అడవులలో ఎక్కువగా కనిపిస్తాయి.

 దొంక కోళ్ళు :

ఇవి పళ్లే టూళ్ళలో పొలాలలో ఎక్కువగా కనిపిస్తాయి. చిన్నవిగా ఉండి తక్కువ కండ కలిగి తక్కువ మాంసమును ఇస్తాయి.

 నిప్పుకోళ్ళు :

ఇవి చాలా పెద్దవిగా ఉంటాయి. నిప్పుకోళ్ళను ఎక్కువగా గుడ్ల కోసము పెంచుతారు.

 చికెన్ వంటలు:

*చికెన్ బిర్యాని

*చికెన్ పకోడి

*చికెన్ పులావ్

*చికెన్ 65

*చికెన్ పచ్చడి

*కోడిమాంసం ఆవకాయ

*తండూరి చికెన్

అంకాపూర్ నాటుకోడి కూర: తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, ఆర్మూరు మండలం, అంకాపూర్ గ్రామంలో తయారుచేసే కోడికూర. 

 తినకూడని పరిస్థితులు:భగందర వ్రణముతో బాదపడుతున్నవారు, మూలవ్యాధితో బాదపడుతున్నవారు, కడుపులో ఉదరకోశ పుండ్లు అల్సర్స్  తో బాదపడుతున్నవారు, మద్యము ఎక్కువగా తాగేవారు, మూత్రకోశ రాళ్ళుతో బాదపడుతున్నవారు కోడిమాంసాన్ని తినరాదు.

 కోడిపందెం : కోడిపందెం అనేది రెండు పందెం కోళ్ళ మధ్య నిర్వహించే క్రీడ. ఈ పందేలను ప్రతీ యేటా సంక్రాంతి పండుగ సమయంలో నిర్వహిస్తుంటారు. ఈ పందాలు ప్రపంచ పురాతన పందాలుగా చరిత్రలో చెప్పబడ్డాయి. 6000 సంవత్సరాలకు పూర్వమే పర్షియా లో కోడి పందాలు జరిగాయని తెలుస్తున్నది. మన రాష్ట్రంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ ఏర్పాట్లతో పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. ఈ పందెం కోసం ప్రత్యేకంగా పెంచే కోడిపుంజులను పందెం కోళ్ళు అంటారు. వీటి ఆహార విషయంలో యజమానులు ఎంతో శ్రద్ధ వహించి పెంచుతారు. పందెం సమయంలో పందెం కోడి కాలికి మూడు నుండి నాలుగు అంగుళాలు చురకత్తిని కట్టి పందెంలోకి దించుతారు. జూదం జరిగే అవకాశం ఉన్నందున ఈ పందేల నిర్వహణ సాంప్రదాయంగా కొనసాగుతున్నప్పటికీ వీటి నిర్వహణకు ప్రభుత్వ అనుమతి ఉండదు.

 కోళ్ళ రకాలు : ఈక రంగును బట్టి పందెం కోళ్లను రకరకాల పేర్లతో పిలుస్తారు. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా డేగ, కాకి రకాలుంటాయి. ఆ తర్వాత నెమలి, పర్ల ఎక్కువగా కనిపిస్తాయి. చవల, సేతువ, కొక్కిరాయి, పచ్చకాకి, రసంగి, కౌజు, మైల, ఎరుపుగౌడు, తెలుపుగౌడు వంటి పలు రకాల కోళ్లుంటాయి. కోడి రంగు, సూర్యుని వెలుగుని బట్టి పందెం రాయుళ్లు రంగంలోకి దిగుతారు. కోడి పందేలను నాలుగు రకాలుగా నిర్వహిస్తారు. ఎత్తుడు దించుడు పందెం, చూపుడు పందెం, ముసుగు పందెం, డింకీ పందెం. వీటిల్లో ఎత్తుడు దింపుడు పందేలకు ఎక్కువ గిరాకీ ఉంటోంది. కోళ్లను తీసుకొచ్చిన వారు కాసే పందేల కంటే వాటిని చూడడానికి వచ్చేవారు కాసే పందేలే వందరెట్లు ఎక్కువగా జరుగుతాయి.

 పందెం తీరు : కోడికి కత్తి కడితే పందేల నిర్వాహకులకు కనకవర్షమే. నిర్వాహకులు ఒక పందెం సొమ్ములో 10 శాతాన్ని కేవులు(తీతలు)గా వసూలు చేస్తారు. ఒక్కో బరిలో రోజుకు తీతలే రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా.

విష సంస్కృతి : సంప్రదాయం పేరుతో సాగే కోడిపందేలలో డబ్బే పరమావధిగా మారింది. తరతరాలుగా వస్తున్న పందేలలో పాటించే నీతికి ఎప్పుడో తిలోదకాలిచ్చారు. కాలికి కట్టిన కత్తితో ప్రత్యర్థి పుంజును చిత్తు చేయగలిగిన పుంజునే విజయం వరించడం న్యాయం. అయితే, ఇప్పుడు త్వరగా పందేలు పూర్తిచేసేందుకు, అడ్డదారుల్లో గెలిచేందుకు కత్తులకు విషరసాయనాలు పూసేందుకు కొందరు పూనుకుంటున్నారు. అలాగే బరిలో దిగే కోళ్లకు స్టెరాయిడ్స్, నొప్పి నివారిణులు ఇష్టానుసారం వినియోగిస్తున్నారు.

తెలుగు నాట కోడి పందెం :

కోడి పందెములు తెనుగువారి వినోదములలో చాలా ప్రాచీనమగు వినోదము. మన సారస్వతములో కేతనకవి కాలము నుండియు నారాయణకవి కాలము వరకు పలువురు కవులు ఈ పందెములను వర్ణించినారు. కోడి పందెపు శాస్త్రము కూడా చాలా ప్రాచీనమైనట్టిదే. నారాయణకవి ఈ విషయములో ఇట్లు వర్ణించినాడు:

 ఆంధ్రుల సాంఘిక చరిత్ర ........... రచయిత సురవరం ప్రతాపరెడ్డి సంవత్సరం 1950 ప్రచురణకర్త :సురవరము ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి చిరునామా :హైదరాబాదు

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author