Telangana తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగం పుంజుకుంటోంది. తాజాగా సిరిసిల్ల జిల్లాలోని గూడెం గ్రామంలో 3 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా. అప్రమత్తమైన అధికారులు ఆ గ్రామంలో లాక్‌డౌన్ విధించారు. దుబాయ్ నుంచి ఇటీవల దేశానికి తిరిగొచ్చిన ఓ వ్యక్తికి హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో టెస్టులు చేయగా. నెగిటివ్ వచ్చింది.
కానీ స్వస్థలం గూడెం గ్రామానికి చేరుకున్న అనంతరం. అతడిలో జలుబు వంటి స్వల్ప లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్టులు చేయగా. అతనికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. దీంతో వైద్యాధికారులు వారి కుటుంబ సభ్యులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో ఇద్దరికీ పాజిటివ్ అని తేలడంతో. బాధితుడి ఆరుగురు కుటుంబ సభ్యులను, అతడు కలిసిన మరో ఏడుగురిని అధికారులు క్వారంటైన్లోకి పంపారు.
ముందస్తు జాగ్రత్తగా. ఆ గ్రామ పంచాయతీ పాలక వర్గం ఊరిలో 10 రోజులపాటు లాక్‌డౌన్ విధిస్తూ ఎవరూ తమ ఇళ్ళ నుంచి బయటకు రాకు కఠిన ఆంక్షలు విధించింది. మరోవైపు రోజురోజుకు రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళనకు గురి చేస్తోంది.బుధవారం ఒక్క రోజే కొత్తగా 14 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని తెలంగాణ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని. అత్యవసర అయితే తప్పా, ప్రయాణాలను కొంతకాలం వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే దేశంలో ఒమిక్రాన్ క్రమంగా తన ఉనికి చాటుతోంది.ఇప్పటివరకు 101 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడగా. దిల్లీలో 20 మందిలో ఈ వేరియంట్‌ను గుర్తించారు.
అక్కడ ఒక్కరోజే 10 మందికి ఈ వేరియంట్ సోకినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో బాధితులకు చికిత్స అందిస్తోన్న వైద్యులు పలు విషయాలు వెల్లడించారు. తమ పర్యవేక్షణలో ఉన్న తొమ్మిది మంది బాధితుల్లో ఒకరికి మాత్రమే లక్షణాలు కనిపించాయని ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ సురేశ్ కుమార్ వెల్లడించారు. అయితే దేశంలో ఒమిక్రాన్ కేసులు నెమ్మదిగా చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి.
జనవరి నాటికి ఒమిక్రాన్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతాయని ఇప్పటికే పలువురు హెచ్చరిస్తున్నారు.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్ విధిస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. నూతన సంవత్సర వేడుకల వేళ ఒమిక్రాన్ వేరియంట్ మరింతమందికి సోకుతుందనే ఉద్దేశంతో డిసెంబర్ 31వ తేదీ, జనవరి 1వ తేదీన రెండు రోజుల పాటు దేశం మొత్తం లాక్ డౌన్ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తం అవుతుందని ప్రచారం జరుగుతోంది.
గుంపులుగా కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం వల్ల ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోందని అందుకే రెండు రోజుల పాటు లాక్‌డౌన్ పెట్టనుందనే వార్త ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో పాఠశాలలు, వ్యాపార సంస్థలు మూసివేయాలనే ఆదేశాలు రానున్నాయని టాక్ నడుస్తోంది.
తిరిగి జనవరి 3వ తేదీ పాఠశాలలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు పున: ప్రారంభం కానున్నాయని సమాచారం. అయితే కేంద్రం లాక్‌డౌన్ విధిస్తుందా లేదా అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఏది ఏమైనా కేంద్రం లాక్‌డౌన్ విధించినా, విధించకున్నా ప్రజలు జాగ్రత్తగా ఉండడమే శ్రేయస్కారం.
తాజాగా సిరిసిల్ల జిల్లాలోని గూడెం గ్రామంలో 3 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా. అప్రమత్తమైన అధికారులు ఆ గ్రామంలో లాక్‌డౌన్ విధించారు. దుబాయ్ నుంచి ఇటీవల దేశానికి తిరిగొచ్చిన ఓ వ్యక్తికి హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో టెస్టులు చేయగా. నెగిటివ్ వచ్చింది.
కానీ స్వస్థలం గూడెం గ్రామానికి చేరుకున్న అనంతరం. అతడిలో జలుబు వంటి స్వల్ప లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్టులు చేయగా. అతనికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. దీంతో వైద్యాధికారులు వారి కుటుంబ సభ్యులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో ఇద్దరికీ పాజిటివ్ అని తేలడంతో. బాధితుడి ఆరుగురు కుటుంబ సభ్యులను, అతడు కలిసిన మరో ఏడుగురిని అధికారులు క్వారంటైన్లోకి పంపారు.
ముందస్తు జాగ్రత్తగా. ఆ గ్రామ పంచాయతీ పాలక వర్గం ఊరిలో 10 రోజులపాటు లాక్‌డౌన్ విధిస్తూ ఎవరూ తమ ఇళ్ళ నుంచి బయటకు రాకు కఠిన ఆంక్షలు విధించింది. మరోవైపు రోజురోజుకు రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళనకు గురి చేస్తోంది.బుధవారం ఒక్క రోజే కొత్తగా 14 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని తెలంగాణ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని. అత్యవసర అయితే తప్పా, ప్రయాణాలను కొంతకాలం వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే దేశంలో ఒమిక్రాన్ క్రమంగా తన ఉనికి చాటుతోంది.ఇప్పటివరకు 101 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడగా. దిల్లీలో 20 మందిలో ఈ వేరియంట్‌ను గుర్తించారు.
అక్కడ ఒక్కరోజే 10 మందికి ఈ వేరియంట్ సోకినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో బాధితులకు చికిత్స అందిస్తోన్న వైద్యులు పలు విషయాలు వెల్లడించారు. తమ పర్యవేక్షణలో ఉన్న తొమ్మిది మంది బాధితుల్లో ఒకరికి మాత్రమే లక్షణాలు కనిపించాయని ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ సురేశ్ కుమార్ వెల్లడించారు. అయితే దేశంలో ఒమిక్రాన్ కేసులు నెమ్మదిగా చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి.
జనవరి నాటికి ఒమిక్రాన్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతాయని ఇప్పటికే పలువురు హెచ్చరిస్తున్నారు.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్ విధిస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. నూతన సంవత్సర వేడుకల వేళ ఒమిక్రాన్ వేరియంట్ మరింతమందికి సోకుతుందనే ఉద్దేశంతో డిసెంబర్ 31వ తేదీ, జనవరి 1వ తేదీన రెండు రోజుల పాటు దేశం మొత్తం లాక్ డౌన్ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తం అవుతుందని ప్రచారం జరుగుతోంది.
గుంపులుగా కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం వల్ల ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోందని అందుకే రెండు రోజుల పాటు లాక్‌డౌన్ పెట్టనుందనే వార్త ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో పాఠశాలలు, వ్యాపార సంస్థలు మూసివేయాలనే ఆదేశాలు రానున్నాయని టాక్ నడుస్తోంది.
తిరిగి జనవరి 3వ తేదీ పాఠశాలలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు పున: ప్రారంభం కానున్నాయని సమాచారం. అయితే కేంద్రం లాక్‌డౌన్ విధిస్తుందా లేదా అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఏది ఏమైనా కేంద్రం లాక్‌డౌన్ విధించినా, విధించకున్నా ప్రజలు జాగ్రత్తగా ఉండడమే శ్రేయస్కారం.
You must be logged in to post a comment.