శ్రీయ శరన్ : క్యూట్ లుక్స్‌లో మతులు పోగొడుతున్న అందాల ముద్దుగుమ్మ శ్రియ
శ్రీయ శరన్ : శ్రియ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఏ ముహూర్తాన ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో తెలియదు గానీ, అప్పటి నుంచి ఇంతవరకూ ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. స్టార్ హీరోలు అందరితో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ కొంతకాలం క్రితం గమనం అనే సినిమా చేసింది. ఈ సినిమా, 10వ తేదీన థియేటర్లలోవిడుదలై మంచి టాక్ అందుకుంది.
ఇటీవల తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లడిన శ్రియ. ప్రెగ్నెన్సీ తరువాత చాలా మార్పులు వచ్చాయి. కానీ వర్కవుట్లు చేసి, కథక్ డ్యాన్స్ చేస్తూ ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టాను. పైగా మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి యోగాను నేర్పించారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యం, ఫిట్ నెస్ అంతా బాగుంటుంది అని అంటుంది శ్రియ.
అలాగే పిల్లలు పుట్టాక ప్రపంచం మారుతుంది. మనకు బాధ్యతలు పెరుగుతాయి. మనిషిలో మార్పులు వస్తాయి. ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లినా మా పాపను తీసుకుని వెళ్తున్నాం అని చెప్పుకొచ్చింది శ్రియ.ఈ ముద్దుగుమ్మ 35 ప్లస్‌లోను తన అందచందాలతో అదరగొడుతుంది. శ్రియ క్యూట్ పిక్స్ చూసి మైమరచిపోతున్నారు.
రీసెంట్‌గా శ్రియ తను నటించిన గమనం సినిమా చూసేందుకు కుకట్‌పల్లి మల్లిఖార్జున థియేటర్లో సందడి చేసింది. కాగా థియేటర్‌కు శ్రియా ఆటోలో రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. కూకట్‌పల్లి దగ్గర నిజాంపేట్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న మల్లీఖార్జున థియేటర్‌కు ఆమె సినిమా చూసేందుకు వచ్చింది.
తన కెరీర్ మొదలు పెట్టి 20 ఏళ్లు కాగా, 20 ఏళ్లు పూర్తయ్యాయంటే నాకే ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇంతకాలం పాటు ఇక్కడ నిలబడతానని ఎప్పుడూ అనుకోలేదు. అక్కినేని నాగేశ్వరరావుగారిలా చివరివరకూ నటించాలని ఉంది. కనీసం మరో 20 ఏళ్ల పాటైనా ఇలా మిమ్మల్ని అలరించాలని ఉంది” అంటూ చెప్పుకొచ్చారు
Samantha: నాగ చైతన్య నుండి సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఆమెపై ఎంత ట్రోలింగ్ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమంతను ట్రోల్ చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడడం పై గతంలోనే స్పందించింది సామ్. తను అందరూ అనుకున్నట్టు కాదు అని. ప్రస్తుత పరిస్థితుల నుంచి తను కోలుకోవడానికి కాస్త సమయం ఇవ్వాలంటూ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది సామ్.
విడాకుల తర్వాత తన కెరీర్ పై దృష్టి సారించి వరుస ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ. తిరిగి సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సామ్ నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే అల్లు అర్జున్. డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తుంది సమంత.
ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్స్ వేడుకకు హాజరైన ఆమె. ‘ఈటైమ్స్’తో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా తాను నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్, నాగచైతన్యతో విడాకుల వ్యవహారంపై స్పందించింది. విడాకుల విషయం గురించి చెప్పదలచుకున్నదంతా చెప్పేశానని స్పష్టం చేసింది. విడాకుల గురించి తనచుట్టూ ఎందరో ఎన్నో అనుకున్నారని, అప్పుడే దానిపై మాట్లాడాలని భావించి మాట్లాడేశానని తెలిపింది.
కాబట్టి మళ్లీ దాని గురించే మాట్లాడాలనుకోవట్లేదని ఆమె తేల్చి చెప్పింది. ఇక నుంచి తాను తన పని మీదే దృష్టి పెడతానని పేర్కొంది. ఇప్పటిదాకా మంచి పాత్రలు చేశానని, భవిష్యత్ లోనూ చేస్తానని, దాని కోసం కష్టపడి పనిచేస్తానని తెలిపింది. తాను చేయబోయే భవిష్యత్ ప్రాజెక్టులన్నీ ఒకదానికొకటి వేరువేరని ఆమె వ్యాఖ్యానించింది. కాబట్టి 2022 అంతా మజాయేనని చెప్పుకొచ్చింది.
ఫ్యామిలీ మ్యాన్ 2లోని బోల్డ్ సీన్స్ పైనా ఆమె మాట్లాడింది. సిరీస్ రిలీజ్ కాకముందు ఎన్నో అనుకున్నారని, కానీ, అది విడుదలయ్యాక అందరికీ తెలిసొచ్చిందని చెప్పింది. స్వేచ్ఛా జీవిగా ఉండే పాత్ర అని తెలిపింది. ఇటీవలి కాలంలో హీరోయిన్లకు అలాంటి పాత్రలు వస్తున్నది చాలా అరుదని పేర్కొంది.
శ్రీయ శరన్ : క్యూట్ లుక్స్‌లో మతులు పోగొడుతున్న అందాల ముద్దుగుమ్మ శ్రియ
శ్రీయ శరన్ : శ్రియ .తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఏ ముహూర్తాన ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో తెలియదు గానీ, అప్పటి నుంచి ఇంతవరకూ ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. స్టార్ హీరోలు అందరితో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ కొంతకాలం క్రితం గమనం అనే సినిమా చేసింది. ఈ సినిమా, 10వ తేదీన థియేటర్లలోవిడుదలై మంచి టాక్ అందుకుంది.
ఇటీవల తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లడిన శ్రియ. ప్రెగ్నెన్సీ తరువాత చాలా మార్పులు వచ్చాయి. కానీ వర్కవుట్లు చేసి, కథక్ డ్యాన్స్ చేస్తూ ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టాను. పైగా మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి యోగాను నేర్పించారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యం, ఫిట్ నెస్ అంతా బాగుంటుంది అని అంటుంది శ్రియ.
అలాగే పిల్లలు పుట్టాక ప్రపంచం మారుతుంది. మనకు బాధ్యతలు పెరుగుతాయి. మనిషిలో మార్పులు వస్తాయి. ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లినా మా పాపను తీసుకుని వెళ్తున్నాం అని చెప్పుకొచ్చింది శ్రియ.ఈ ముద్దుగుమ్మ 35 ప్లస్‌లోను తన అందచందాలతో అదరగొడుతుంది. శ్రియ క్యూట్ పిక్స్ చూసి మైమరచిపోతున్నారు.
రీసెంట్‌గా శ్రియ తను నటించిన గమనం సినిమా చూసేందుకు కుకట్‌పల్లి మల్లిఖార్జున థియేటర్లో సందడి చేసింది. కాగా థియేటర్‌కు శ్రియా ఆటోలో రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. కూకట్‌పల్లి దగ్గర నిజాంపేట్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న మల్లీఖార్జున థియేటర్‌కు ఆమె సినిమా చూసేందుకు వచ్చింది.
తన కెరీర్ మొదలు పెట్టి 20 ఏళ్లు కాగా, 20 ఏళ్లు పూర్తయ్యాయంటే నాకే ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇంతకాలం పాటు ఇక్కడ నిలబడతానని ఎప్పుడూ అనుకోలేదు. అక్కినేని నాగేశ్వరరావుగారిలా చివరివరకూ నటించాలని ఉంది. కనీసం మరో 20 ఏళ్ల పాటైనా ఇలా మిమ్మల్ని అలరించాలని ఉంది” అంటూ చెప్పుకొచ్చారు
Samantha: నాగ చైతన్య నుండి సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఆమెపై ఎంత ట్రోలింగ్ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమంతను ట్రోల్ చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడడం పై గతంలోనే స్పందించింది సామ్. తను అందరూ అనుకున్నట్టు కాదు అని. ప్రస్తుత పరిస్థితుల నుంచి తను కోలుకోవడానికి కాస్త సమయం ఇవ్వాలంటూ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది సామ్.
విడాకుల తర్వాత తన కెరీర్ పై దృష్టి సారించి వరుస ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ. తిరిగి సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సామ్ నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే అల్లు అర్జున్. డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తుంది సమంత.
ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్స్ వేడుకకు హాజరైన ఆమె. ‘ఈటైమ్స్’తో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా తాను నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్, నాగచైతన్యతో విడాకుల వ్యవహారంపై స్పందించింది. విడాకుల విషయం గురించి చెప్పదలచుకున్నదంతా చెప్పేశానని స్పష్టం చేసింది. విడాకుల గురించి తనచుట్టూ ఎందరో ఎన్నో అనుకున్నారని, అప్పుడే దానిపై మాట్లాడాలని భావించి మాట్లాడేశానని తెలిపింది.
కాబట్టి మళ్ళ్ల దాని గురించే మాట్లాడాలనుకోవట్లేదని ఆమె తేల్చి చెప్పింది. ఇక నుంచి తాను తన పని మీదే దృష్టి పెడతానని పేర్కొంది. ఇప్పటిదాకా మంచి పాత్రలు చేశానని, భవిష్యత్ లోనూ చేస్తానని, దాని కోసం కష్టపడి పనిచేస్తానని తెలిపింది. తాను చేయబోయే భవిష్యత్ ప్రాజెక్టులన్నీ ఒకదానికొకటి వేరువేరని ఆమె వ్యాఖ్యానించింది. కాబట్టి 2022 అంతా మజాయేనని చెప్పుకొచ్చింది.
ఫ్యామిలీ మ్యాన్ 2లోని బోల్డ్ సీన్స్ పైనా ఆమె మాట్లాడింది. సిరీస్ రిలీజ్ కాకముందు ఎన్నో అనుకున్నారని, కానీ, అది విడుదలయ్యాక అందరికీ తెలిసొచ్చిందని చెప్పింది. స్వేచ్ఛా జీవిగా ఉండే పాత్ర అని తెలిపింది. ఇటీవలి కాలంలో హీరోయిన్లకు అలాంటి పాత్రలు వస్తున్నది చాలా అరుదని పేర్కొంది.
You must be logged in to post a comment.