తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ఉన్న ప్రజలు ఎక్కువగా మల్లన్న బోనాలు జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలలో ప్రతి ఇంటి కుల దైవం కొమురవెల్లి మల్లన్న దేవుడు.
మల్లన్న దేవుడు శివుని యొక్క కుమారుడిగా మరియు శివుని మరిఓక రూపంగా భావిస్తారు. దేవుడిని ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మల్లన్న దేవుని ఆదివారం ప్రీతికరమైన దినంగా జరుపుకుంటారు. ప్రతి ఆదివారం రోజున చాలామంది భక్తులు ఉపవాస దీక్షలను పాటిస్తారు.
కోమురవెల్లి మల్లన్న కు బోనాలు గెద్దే పట్నాలు, పెద్ద పట్నాలు అని వినూత్న రీతిలో మల్లన్నను కొలుస్తారు.
మల్లన్న స్వామికి ప్రత్యేకమైన భక్తులు ఉంటారు. వీరు స్వామికి అంకితం చెయ్యబడ్డట్టుగా భావించి వీరు వారి కాలుకి ఒక ప్రత్యేకమైన వెండి కడేంను ధరిస్తారు. ఆ కడెం ధరించిన వారిని మల్లన్న దేవుడి ప్రతిరూపంగా భావిస్తారు.
వీరు ప్రతి ఆదివారం తలస్నానం ఆచరించి మల్లన్న స్వామికి దీపారాధన చేసి ఉపవాస దీక్షలో ఉంటారు. మల్లన్న స్వామికి ప్రీతికరమైన వస్తువులు వీరగోల, గజ్జెలలాగు, డమరుకం, ముసుగువల.
వీరగోల అనేది చేతిలో పట్టుకోనే సాధనం. ఇది అస్త్రంలా పనిచేస్తుంది. దీనిని జనుముతో తయారు చేస్తారు. ఇది పొడవాటి కొరడాను పోలి ఉంటుంది. తర్వాత దానికి పసుపును రాస్తారు. దీనితో వీపుపై ఒక దెబ్బ తగిలితే వారిపై ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి అని భావిస్తారు.
గజ్జల లాగు ఇది ఒక నడుముకు ధరించే దుస్తువు. ఇది ఒక నెక్కర్ను(షార్ట్) పోలి ఉంటుంది. ఇది ఎరుపు వర్ణంలో ఉన్న వస్త్రాన్ని నెక్కరు గా కుట్టిస్తారు. దీనికి చివరన గజ్జెలతో అలంకరిస్తారు. మరొకటి మూసుగువల, ఇది సాధారణంగా మనం బయట చూసే వలలాగా ఉంటుంది. కానీ ఇది వివిధ రంగులతో ఆకర్షణీయంగా ఉంటుంది.
ముఖ్యంగా తెలంగాణలోని ప్రజలు సంక్రాంతి పర్వదినాన ఎక్కువగా ఈ బోనాలు వారి ఇంట్లో జరుపు కుంటారు.ఆ రోజున ఇంటిని శుభ్రం చేసి బంతిపూలతో ఇంటిని అందంగా అలంకరిస్తారు. ఆరోజు దేవునికి బోనం సమర్పిస్తారు. దేవుని గదిలో మల్లన్న గద్దె ఉంటుంది. ఆ గద్దెను పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. మరియు బంతి పూల మాలను దేవునికి మాలగా వేస్తారు. తర్వాత ఉపవాస దీక్షలో ఉండి బోనం తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. బోనం అనగా నైవేద్యం ఈ నైవేద్యంను బెల్లం మరియు బియ్యంతో తయారుచేస్తారు. దీన్ని బెల్లన్నం కూడా వాడుక భాషలో పిలుస్తారు.
మల్లన్న దేవుని గురించి చెప్పుకోదగ్గ విషయం మరొకటి ఉంది. అది పట్నాలు, ఆ పట్నాలు వేయడానికి ఒక ప్రత్యేకమైన పూజారులు ఉంటారు.వీరిని ఒగ్గోల్లు అంటారు. ఈ పూజారులు ఆకుపచ్చ, తెల్ల, పసుపు, ఎరుపు, నలుపు వర్ణాలను ఉపయోగించి ఒక పెద్ద ముగ్గును వేస్తారు. దీనిని మల్లన్న పెద్ద పట్నం అంటారు.
మల్లన్న దేవున్ని భక్తులకు కోరిన కోరికలు తీర్చే దేవుడిగా సంతానాన్ని ప్రసాదించే దైవంగా మరియు దీర్ఘకాల జబ్బులను తొలగించే దైవంగా భావిస్తారు.
మల్లన్నను పూజించేటప్పుడు పసుపును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆ పసుపు ను భక్తులు బొట్టుగా పెట్టుకుంటారు. ఆ బొట్టునే మల్లన్న పసుపు బండారి అని అంటారు.
మల్లన్న దేవుడు చూడడానికి చాలా గంభీరంగా కనిపిస్తూ కోరమీసాల ను కలిగి ఉండి చేతిలో పెద్ద ఖడ్గంను పట్టుకుని ఆసీనుడై ఉంటాడు. భక్తులు మల్లన్న దేవునికి గుమ్మడి కాయలు, కోరిన కోరికలు తీర్చడానికి మల్లన్నకు కోరమీసాల సమర్పిస్తారు. భక్తుల కష్టాలను తొలగించే దైవంగా కొమురవెల్లి మల్లన్నను కొలుస్తారు.

Niharika Mudhurakola
You must be logged in to post a comment.