Big Boss 5 - Rahul Sipligunj: బిగ్‌బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ తో ఈ సీజన్ బిగ్ బాస్ కంటెస్టెంట్ లలో తన సపోర్ట్ ఎవరికో చెప్పేశాడు. బిగ్ బాస్ సీజన్ 5 మొదటి వారం నుండి ఇప్పటివరకు అటు బుల్లితెర ప్రేక్షకులను తన మాటలతో పాటు ఆటలతోనూ ఎంతగానో ఆకట్టుకున్న వీజే సన్నీకే తన సపోర్ట్ అంటూ రాహుల్ సిప్లిగంజ్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ విజేత సన్నీనే అవుతాడని అతడి గేమ్ నచ్చే సపోర్ట్ చేస్తున్నానని రాహుల్ తెలిపాడు.
గతంలో అందరూ బాగానే ఆడుతున్నారని చెప్పిన రాహుల్ సిప్లిగంజ్ తాజాగా సన్నీకి సపోర్ట్ చేస్తూ వార్ వన్ సైడ్ అంటూ హార్ట్ సింబల్ తో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. విజే సన్నీ ఆట బాగా ఆడుతున్నాడని, ఎవరికి వారు నచ్చిన వాళ్లకు సపోర్ట్ చేసుకోవచ్చు అని రాహుల్ సిప్లిగంజ్ తెలిపారు. ఇక ఈవారం ఎలిమినేషన్ ఎవరు అవుతారో నేడు తేలనుండటంతో పాటు ఇప్పటికే "టికెట్ టూ ఫినాలే" రేసులో ఫస్ట్ ఫైనలిస్ట్ గా శ్రీరామచంద్ర చేరుకున్నాడు. శనివారం జరిగిన ఎపిసోడ్ లో నామినేషన్ లో ఉన్న మానస్, ప్రియాంక సింగ్, ఆర్జే కాజల్, శ్రీరామచంద్ర, సిరి హనుమంత్ లలో శ్రీరామచంద్ర సేవ్ అవగా. ప్రియాంక సింగ్, ఆర్జే కాజల్ డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5 13వ వారం ఎలిమినేషన్‌కు చేరుకుంది. మానస్, కాజల్, పింకీ, సిరిలలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే దానిపై మరి కొన్ని గంటల్లో అఫిషియల్‌గా ఓ క్లారిటీ రానుంది. అయితే నెట్టింట మాత్రం ప్రియాంక సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే బిగ్‌బాస్ ఈ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఇక బయట ఉన్న ఫాలోవర్స్, స్నేహితులు, శ్రేయోభిలాషులు లోపలున్న కంటెస్టెంట్స్ మద్దతుగా పోస్టులు చేయడం, రిక్వెస్టులు చేయడం వంటి పనులను చేస్తున్నారు. అసలు లోపలున్న వారిలో విజేతగా ఎవరు నిలుస్తారనే దానిపై ఎవరి అభిప్రాయం వారికుంది. ఈ క్రమంలో తన మద్దతు ఈసారి అతనికే అని అంటున్నాడు రాహుల్ సిప్లిగంజ్. ఈ సింగర్, రీసెంట్‌గా ఓ ఇన్‌స్టాస్టోరిలో బిగ్‌బాస్ విన్నర్ అతనే అవుతాడని చెప్పేశాడు.
రాహుల్ సిప్లిగంజ్ బిగ్‌బాస్ సీజన్ 3 విజేత అనే సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈయన ఒకరికి తన సపోర్ట్ చేస్తున్నాడంటే తప్పకుండా అతని ఫాలోవర్స్ కూడా సదరు కంటెస్టెంట్‌కే సపోర్ట్‌ను తెలియజేస్తారనడంలో సందేహం లేదు. సరే! ఇంతకీ రాహుల్ సిప్లిగంజ్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడో తెలుసా? వీజే సన్నీకి. ఇంతకు ముందు ఓ సందర్భంలో ఈ సీజన్ బిగ్‌బాస్ విన్నర్ ఎవరు అవుతారంటే అందరూ బాగా ఆడుతున్నారంటూ ఎవరు గెలుస్తారో ఇప్పుడే చెప్పలేమన్న రాహుల్ సిప్లిగంజ్ ఈసారి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడాడు. వీజే సన్నీ గేమ్ చాలా బాగా ఆడుతున్నాడని, తన పోస్ట్ ద్వారా ఎవరినీ ఇన్‌ఫ్లూయెన్స్ చేయాలనుకోవడం లేదని, ఎవరికి వారు నచ్చినవాళ్లకు సపోర్ట్ చేసుకోవచ్చునని తెలిపారు రాహుల్ సిప్లిగంజ్. వార్ వన్ సైడ్ అయ్యిందంటూ హార్ట్ సింబల్ పెట్టడం కొస మెరుపుగా మారింది.
ఇప్పటికే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ టాప్ 5లో చేరుకోవడం కోసం తమదైన రేంజ్‌లో ప్రాణం పెట్టి హండ్రెడ్ పర్సెంట్ గేమ్ ఆడేస్తున్నారు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్, సెలబ్రిటీలు బిగ్‌బాస్ విన్నర్ ఫలానా అంటూ తమ అభిప్రాయాలను చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే టికెట్ టు ఫినాలేకు ముందుగా శ్రీరామచంద్ర చేరుకున్నాడు. ఈ వారం కాకుండా వచ్చే వారం మరో ఎలిమినేషన్ ఉంటుంది.
ఆ తరువాత హౌస్ మేట్స్ తో మాట్లాడారు నాగార్జున. ముందుగా వారి ముందొక కంప్లైంట్ బాక్స్ ను పెట్టారు. ఒక్కో హౌస్ మేట్ ని పిలుస్తూ. ఎవరిపై కంప్లైంట్ చేస్తున్నారో, ఎందుకో చెప్పాలని అడిగారు నాగార్జున. ముందుగా సన్నీ సిరిపై కంప్లైంట్ చేస్తూ. 'హౌస్ లోకి రాగానే ఫస్ట్ ఫ్రెండ్ అయింది. కానీ తరువాత ఇద్దరికీ పడలేదు. వెళ్లేలోపు మళ్లీ ఫ్రెండ్షిప్ బాండ్ క్రియేట్ అవ్వాలని' చెప్పాడు. ఈ వారం గేమ్ లో కూడా కోపంతో ఆడిందని, మొండిగా బిహేవ్ చేసిందని చెప్పాడు.
ఆ తరువాత సిరిని ఎవరిపై కంప్లైంట్ చేస్తావ్ అని నాగార్జున అడగ్గా షణ్ముఖ్ వైపు చూపించింది. వెంటనే షణ్ముఖ్ 'అసలు నేనేం చేశా సార్' అంటూ పైకి లేవగా. 'ఏం చేయడమేంటి ? తన(సిరి) కోసం సరిగ్గా ఆడకుండా, శ్రీరామ్ కోసం ఆడి' అని నాగ్ డైలాగ్ కొట్టారు. వెంటనే హౌస్ మేట్స్ అంతా నవ్వేశారు. నాగార్జున సిరితో మాట్లాడుతూ 'నువ్ ఫ్రెండ్ అయినందుకు సిగ్గుపడుతున్నా అని అన్నాడు కదా అంటూ షణ్ముఖ్ కి సెటైర్ వేశారు. 'అయినా నువ్ ఫ్రెండ్లీ హగ్ ఇస్తూనే ఉన్నావ్' అంటూ సిరికి డైలాగ్ కొట్టారు నాగార్జున.
షణ్ముఖ్ ప్రియాంకపై కంప్లైంట్ చేస్తూ 'తనను తాను తగ్గించుకొని పక్కవాళ్లను పైన పెడుతుందని' చెప్పాడు. ఆ తరువాత నాగార్జున ప్రియాంకపై తనకు కూడా ఓ కంప్లైంట్ ఉందని అన్నారు. హౌస్ లో ఈరోజు శ్రీరామ్ అనారోగ్యంగా ఉండడానికి కారణం పింకీ సొంత వైద్యమేనంటూ నాగ్ ఆమెకి క్లాస్ పీకాడు. 'సెల్ఫ్ మెడికేషన్ నీకు చేసుకోవద్దు పక్కవాళ్లకు కూడా చేయొద్దు' అని నాగ్ చెప్పేసరికి ప్రియాంక ఏడ్చేసింది. కావాలని అలా చేయలేదని. మంచి ఉద్దేశంతో అతనికి నొప్పి తగ్గాలనే చేశానంటూ చెప్పింది.
You must be logged in to post a comment.