హరి హర వీర మల్లు సినిమా యొక్క సమాచారం , how was the movie of Hari Hara Veera Mallu?

 

ఈ చిత్రం సెప్టెంబర్ 2020 లో చిత్రీకరణను ప్రధానంగా హైదరాబాద్‌లో జరుపుకోవడంతో దాని నిర్మాణాన్ని ప్రారంభించింది. మొదటగా 29 ఏప్రిల్ 2022న తెలుగు, తమిళం, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల చేయడానికి షెడ్యూల్ చేయబడిన ఈ చిత్రం COVID-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది. కళ్యాణ్ ఇతర సినిమా మరియు రాజకీయ కమిట్‌మెంట్ల కారణంగా నిర్మాణం కూడా ఆలస్యం అయింది.



వీర మల్లుగా పవన్ కళ్యాణ్, పంచమిగా నిధి అగర్వాల్, ఔరంగజేబుగా అర్జున్ రాంపాల్, రోషనారాగా నర్గీస్ ఫక్రీ, ఆదిత్య మీనన్ మరియు  పూజిత పొన్నాడ ఒక పాటలో డ్యాన్సర్లుగా నటించబోతున్నారు.



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీర మల్లు. వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ లు కొట్టిన పవన్ ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలన్న కసిమీద ఉన్నారు. పవర్ స్టార్ తీస్తున్న సినిమాల్లో క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఒకటి. పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో  ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. మంచి యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ మంచి పాత్రలో కనిపించనున్నాడని మొదటి నుంచి అనేక కథనాలు వినిపిస్తున్నాయి. పూర్వ కాలం నాటి కథతో రూపొందుతూన్న ఈ సినిమాలో పవన్ సరసన నటిగా నిధి అగర్వాల్ నటిస్తున్న విషయం ఇప్పటికే తెలిసిన విషయమే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన  విడుదలైన ఫోటోలు మరియు వీడియోలు  అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.



తాజాగా హరిహర వీరమల్లు సెట్ నుంచి మరో ఫోటోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ పోస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షూటింగ్ అయిన తర్వాత కంప్యూటర్ లో  ఎలా ఉంది అని పరిక్షించారు. ఆ పక్కనే ఈ హరి హర వీర మల్లు సినిమాకు దర్శకత్వం వహిస్తున్న క్రిష్ కూడా ఉన్నారు. హరి హర వీర మల్లు సినిమా కోసం ఆ కధకి సంబంధించిన ఆ కాలం నాటి సెట్స్ ను పెద్ద స్థాయిలో వేశారు. అలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్లో ప్రస్తుతం సినిమా యొక్క షూటింగు జరుగుతుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ హరి హర వీర మల్లు సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ కూడా  కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ హరి హర వీర మల్లు సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్లు రాబోతున్నాయి అని  దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. మరి ఈ హరి హర వీర మల్లు సినిమాతో పవన్ కళ్యాణ్ తన హిట్ ఫార్మ్ ను ఏ విదంగా కొనసాగిస్తారో చూడాలి.



వకీల్ సాబ్ మరియు  భీమ్లానాయక్    సినిమాలతో కొత్తగా కనిపించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు హర వీర మల్లు సినిమా తో మరొకసారి ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. వరుసగా 2 బ్లాక్ బస్టర్ సినిమాల తరవాత, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకు ఎక్కబోతున్నది. పవన్ కళ్యాణ్ లాంటి ఒక హీరోను ఇలాంటి పాత్రలో ఎంత గొప్పగా చూపిస్తారో వేచి చూడాల్సిందే. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఇలాంటి పాత్రల్లో ఎప్పుడు కూడా చూడలేదు. మునుపు ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రత్యేకంగా ఈ సినిమా మాత్రం ఉండ బోతుంది





పవన్ కళ్యాణ్ ఒక పెద్ద హీరో, ఆయన ఇప్పటి వరకు చేసినవి కనీసం 50 సినిమాలు కూడా లేకపోయిన, ఆయనకు అంటూ ప్రజలలో ఒక ప్రతీయక గుర్తింపు ఉంది. ఒక ప్రత్యేక అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆయన ఆజ్ఞతవాసి సినిమా తర్వాత చాలా గాప్ తీసుకున్నారు. ఎప్పుడు, ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్న ఫాన్స్ కి చాలా కాలం తర్వాత వకీల్ సాబ్ సినిమా రావడం జరిగింది. అయితే ఈ సినిమా చాలా కాలం తర్వాత వస్తుంది కదా అంత బాగోకపోవచ్చు అని అందరు అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తిరగ రాస్తూ ఈ సినిమా చాలా పెద్ద విజయం పొందింది. మళ్ళీ వకీల్ సాబ్ తర్వాత భీమ్లానాయక్ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నారు.



చాలా మంచి వరుస విజయాలతో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఎలాంటి ప్రదర్శన చేస్తారో వేచి ఉండాలి. మరొక వైపు ఈ సినిమాలో కధనాయక గా నిధి అగర్వాల్ నటించబోతుంది. అయితే ఇప్పటికి సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారు ప్రాక్టీసు చేస్తున్న మరియు కొన్ని సినిమాకి సంబంధించిన చిత్రాలు రిలీస్ అయ్యాయి. వీటికి చాలా మంచి స్పందన కూడా లభిస్తుంది. ముక్యంగా సినిమా కోసం ప్రాక్టీస్ చేస్తున్న వీడియో చాలా బాగా వైరల్ అవుతుంది ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ గారి ప్రాక్టీస్ నటన కూడా చాలా బాగా ఉండడం తో ఫాన్స్ ఇంక పండగ చేసుకుంటున్నారు. వకీల్ సాబ్, భీమ్లానాయక్, ఇప్పుడు హరి హర వీరమల్లు, మరియు దీని తర్వాత భవదీయుడు భగతసింగ్ అనే సినిమా కూడా రాబోతుంది. దీనిని గబ్బర్ సింగ్ సినిమాను తీసిన హరీష్ శంకర్ తీయబోతున్నారు. గబ్బర్ సింగ్ సినిమా ఎంత మంచి హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే. దీనితో మరొకసారి ఈ భవదీయుడు భగతసింగ్ పైన కూడా భారీ అంచనాలు ఉండబోతున్నాయి.

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author