బిగ్ బాస్‌పై షణ్ముఖ్ అన్న సంపత్ సంచలన ఆరోపణలు. టైటిల్ ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యారా? సపోర్ట్ లేదంటూ మ్యాటర్ లీక్
బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఓ లెక్క సిరి షణ్ముఖ్‌లు మరో లెక్క అన్నట్టుగా చూపిస్తున్నారు. గంటన్నర షోలో దాదాపు తెరపై కనిపించేది వీళ్లిద్దరే కావాలని చూపిస్తున్నారో ఇద్దర్నీ బ్యాడ్ చేయాలనే చూపిస్తున్నారో తెలియదు కానీ ఈ ఇద్దరూ ప్రతిరోజూ హాట్ టాపిక్కే.
నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్‌లో సిరి షణ్ముఖ్‌ని హగ్ ఇవ్వరా ఫుల్‌గా అంటూ కోరి హగ్ చేసుకోవడం ఒక అరాచకం అయితే సిరి-సన్నీల మధ్య లవ్ ట్రాక్ పెడుతున్నారని ఏడ్చినంత పనిచేశాడు షణ్ముఖ్. వీడేంట్రా బాబూ సిరిని మరీ ఈ రేంజ్‌లో కంట్రోల్ చేస్తున్నాడు నడవలేని స్థితిలో సిరి ఉన్నప్పుడు మానస్ సిరి ఎత్తుకున్నందుకు తెగ మొత్తుకున్నాడు అంతకు ముందు సన్నీని అన్నయ్య అని పిలువు అని చెప్పి ఆమె నాకు మాత్రం సొంతం అన్నట్టుగా వ్యవహరించాడు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో అయితే నువ్ నా ఫ్రెండ్‌గా ఉండొద్దు నిన్ను నన్ను వేరు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు సన్నీతో లవ్ ట్రాక్ వేస్తున్నారు నీ క్యారెక్టర్‌ని బ్యాడ్ చేస్తున్నారు చూసే జనాలు నీ క్యారెక్టర్ బ్యాడ్ అని అనుకుంటారు అంటూ బ్రహ్మాస్త్రాలు విసిరాడు. అయితే వేరే వాడితో లవ్ ట్రాక్ వేస్తే సిరికి క్యారెక్టర్ బ్యాడ్ అవుతుందని గ్రహించిన ఈ బ్రహ్మ తనతో రొమాన్స్ చేస్తుంటే. ముద్దులు పెట్టుకుంటుంటే. హగ్ లు చేసుకుంటుంటే ఆమె క్యారెక్టర్ బ్యాడ్ అవుతుందని ఆలోచించకపోవడం ఏంటో అర్ధం కాలేదు. అయితే ఫ్రెండ్ షిప్ హగ్ ఫ్రెండ్ షిప్ హగ్ అని బిగ్ బాస్ హౌస్‌ని హగ్ బాస్ హౌస్‌గా మార్చేసిన షణ్ముఖ రిని ఎందుకంత కంట్రోల్‌లో పెడుతున్నాడు అసలు ఆమెతో ఎవరు చనువుగా ఉన్నా ఎందుకు తట్టుకోలేకపోతున్నాడు అని సిరితో పాటు షో చూసే ఆడియన్స్ కూడా తలలు పట్టుకున్నారు.
అయితే వీటన్నింటిపై క్లారిటీ ఇస్తూ షణ్ముఖ్ జస్వంత్ అన్నయ్య అదేనండి మొన్న బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చి తమ్ముడిపై పంచ్‌లు వేశాడే ఆ సంపత్ వినయ్ బిగ్ బాస్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. సిరి-షణ్ముఖ్‌ల బంధంపై ఓపెన్ కామెంట్స్ చేస్తూ తన తమ్ముడిపై వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇస్తూ ఎమోషనల్ అయ్యాడు.
సిరి-షణ్ముఖ్ బాండింగ్ గురించి మాట్లాడే ముందు బిగ్ బాస్ ఎడిటర్ మామకి థాంక్స్ చెప్పాలి ఇంత హైప్ ఇస్తున్నందుకు. షణ్ముఖ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిరిని చాలా ప్రొటెక్టివ్‌గా చూస్తున్నాడు. చాలామందికి పొసిసివ్, కంట్రోలింగ్ అని అనుకోవచ్చు కానీ రెండింటి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది.
బాడీ షేమింగ్ కంటే దారుణమైనది హ్యూమన్ ఎమోషన్స్‌ని తప్పుగా అర్థం చేసుకోవడం షణ్ముఖ్‌కి బ్రహ్మ అనే పేరే ఊరికే రాలేదు వాడి లెక్కలు వాడికి ఉంటాయి. శ్రీరామ్ కూడా షణ్ముఖ్ ఎంత పర్ఫెక్ట్‌గా లెక్కలేస్తాడో చెప్పాడు.
నిన్న రాత్రి ఎపిసోడ్‌లో సన్నీ, మానస్, కాజల్‌లు సరదాగా ఆటపట్టిస్తారు. సన్నీ-సిరిల మధ్య కొత్త ట్రాక్ వేస్తూ ఇద్దరికీ లింక్ పెడతారు. ఆ విషయం సన్నీ కూడా అన్నాడు. వాళ్లు సరదాగానే అన్నారు కరెక్టే. ఇదంతా విన్న షణ్ముఖ్ లేచి బయటకు వెళ్లి కూర్చున్నాడు. నీ క్యారెక్టర్ బయటకు దరిద్రంగా వెళ్తుంది జాగ్రత్త. ఇద్దరితో ట్రాక్ నడుపుతుందనే పేరు వస్తుంది. నువ్ ఇలాంటి ట్రాక్‌లు నడిపితే నాకు ఫ్రెండ్‌గా ఉండొద్దు. నేను చాలా కష్టపడితే నాకు ఈ పేరు వచ్చింది. దాన్ని పాడుచేయకు. కామన్స్ సెన్స్ ఉండాలి బయటకు వెళ్తే నువ్ ఎవరో. నేను ఎవరో. నీకు చెప్పడం వల్ల నాకు రూపాయి ఉపయోగం ఉండదని చెప్తాడు.
ఎవరు ఔనన్నా కాదన్నా. షణ్ముఖ్ గేమ్‌ని జనం వ్యూలోనే చూస్తాడు. సిరి కూడా చెప్పింది. నేను ఎమోషనల్‌గా డిపెండ్ అయిపోతా అని. షణ్ముఖ్‌తో అలాంటి ఫ్రెండ్ షిప్ ఉంది. సిరిని పెళ్లి చేసుకోబోయే శ్రీహాన్ వచ్చినప్పుడు కూడా షణ్ముఖ్‌కి థాంక్స్ చెప్పాడు. షన్నూ ఇన్ టెన్షన్ ఫ్రెండ్ షిప్ అని మాత్రమే ఉంది. జెస్సీని ఏ విధంగా ప్రొటెక్ట్ చేశాడో... సిరిని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. షణ్ముఖ్ వల్లే సిరి గేమ్ ఎఫెక్ట్ అవుతుందని అనుకునేవాళ్లకి నేను చెప్పేది ఏంటంటే. బిగ్ బాస్‌లో లవ్ ట్రాక్‌లు పెట్టడం చూస్తూనే ఉన్నాం. సిరి సన్నీతో కాస్త క్లోజ్‌గా ఉంటే. దాన్ని లవ్ ట్రాక్‌లాగే చూపిస్తారు. అప్పుడు ట్రై యాంగిల్ అంటూ సిరిని బ్యాడ్‌గా చూపించరని గ్యారంటీ లేదు. ఇవన్నీ షణ్ముఖ్ ముందే ఊహించాడు కాబట్టే స్టార్టింగ్‌లోనే కట్ చేశాడు.
మొదట్లో శ్రీరామ్‌తో సిరి లవ్ ట్రాక్ పెట్టాలని చూశారు. షణ్ముఖ్ కట్ చేశాడు. ఇప్పుడు సన్నీతో పెట్టాలని అనుకున్నారు. కట్ చేశాడు. దీని వల్ల షణ్ముఖ్‌కి ఏమి వస్తుంది. కంట్రోలర్ పొసిసివ్ అనే ట్యాగ్స్ మాత్రమే వస్తున్నాయి. బ్రహ్మ ఎప్పుడూ రెండు వారాలు ముందుకి ఆలోచిస్తాడు. సిరి లవ్ ట్రాక్‌లో పడితే. ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుందని ముందే గ్రహించాడు కాబట్టే ఆమెను కంట్రోల్ చేశాడు.
సిరి విషయంలో రెస్పాన్సిబిలిటీతో ఉంటున్నాడు. కాజల్, మానస్‌లు కావాలనే సిరి-సన్నీల మధ్య లవ్ ట్రాక్ వేయాలని చూశారు. పాటలు కూడా పాడారు. అది కంటిన్యూ అయితే ఎఫెక్ట్ ఎవరిపై పడుతుంది. బయటప్రొజెక్ట్ ఎలా అవుతుందని షన్నూకి తెలుసు. అందుకే సిరికి జాగ్రత్తలు చెప్తున్నాడు. నాకెందుకులే పోతే పోయిందిలే అని అనుకుంటే సిరి ఇప్పటివరకూ వెళ్లింది.
షన్నూ నువ్ అందరికీ అర్థం కాకపోవచ్చు. కానీ అర్ధం అయితే నువ్ అంటే ఏంటో తెలుస్తుంది. సిరిని కంట్రోల్ చేస్తున్నావని చాలామంది అనుకోవచ్చు. అలా ఆపాడు కనుకునే సిరి మరో రెండు వారాలు హౌస్‌లో ఉంటుంది. నిజం ఏంటంటే. బిగ్ బాస్ షణ్ముఖ్‌కి సపోర్ట్‌గా లేడు. ఎందుకు సపోర్ట్‌గా ఉంటాడు. షణ్ముఖ్ మసాలాని ఎంకరేజ్ చేయడు. మసాలా క్రియేట్ చేయాలని చూస్తే ఆపేస్తావ్. గొడవలు నీకు నచ్చవు. అలాంటప్పుడు బిగ్ బాస్ నీకు సపోర్ట్ చేయడు. కానీ బిగ్ బాస్ సపోర్ట్ చేయకపోయినా. మీమంతా నీకు సపోర్ట్ చేస్తాం... నీ క్యారెక్టర్‌కి డిజర్వ్ అయ్యే టైటిల్ నీకు ఇస్తాం’ అంటూ చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు
అంతా బాగానే ఉంది కానీ. తమ్ముడు షణ్ముఖ్ లాగే. ఈ అన్నయ్య కూడా లాజిక్ మిస్ అయ్యాడు. సిరికి లవ్ ట్రాక్ వేస్తే ఆమె క్యారెక్టర్ బ్యాడ్ అవుతుందని అంటున్నాడు. అంటే హౌస్‌లో ఉన్న వేరే వ్యక్తితో లవ్ ట్రాక్ వేస్తేనే సిరి క్యారెక్టర్ బ్యాడ్ అవుతుందా? షణ్ముఖ్‌తో లవ్ ట్రాక్ వేస్తే సిరి క్యారెక్టర్ బ్యాడ్ కావడం లేదా? హగ్ ఇచ్చుకుని. ముద్దులు పెట్టుకుని రొమాన్స్‌లో తేలుతుంటే సిరి క్యారెక్టర్ బ్యాడ్ కావడంలేదా? ఎట్టెట్టా. షణ్ముఖ్‌కి మసాలా వేయడం ఇష్టం ఉండదా? బిగ్ బాస్ సీజన్ 5 మసాలా సీన్లు అని గూగుల్ సెర్స్ చేస్తే తమ తమ్ముడి గారి అరాచకాలు. హగ్‌లు యుద్దాలే కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఇక షణ్ముఖ్‌కి మనసా వేయడం రాదని చెప్పడం ఏంటో. ఎదుటి వ్యక్తిని కంట్రోల్‌లో పెట్టాలి అంటే ముందు మనం కంట్రోల్‌లో ఉండాలి బ్రదర్.
సిరి-షణ్ముఖ్‌లది ఫ్రెండ్ షిప్ అని ఈ అన్నయ్య చెప్తున్నాడు కానీ. స్వయంగా వాళ్లిద్దరే హోస్ట్ నాగార్జున ముందే ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతున్నాం. తప్పని తెలిసినా ఇద్దరి మధ్యన కనెక్షన్ పెరుగుతుందని జనం ఎలా రిసీవ్ చేసుకుంటారా అని కూడా ఆలోచించడం లేదని బహిరంగంగానే చెప్పింది సిరి. అలాంటప్పుడు దాన్ని ఫ్రెండ్ షిప్ అని నమ్మడానికి జనం హోస్ట్ నాగార్జున కాదు కదా బ్రదర్. ఆవలిస్తే పేగులు లెక్కపెట్టేస్తారు సుమీ. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే. బిగ్ బాస్ నిర్వాహకులతో పాటు. హోస్ట్ నాగార్జున కూడా షణ్ముఖ్‌కి అనుకూలంగా ఉన్నారనేది టాక్. అయితే షణ్ముఖ్ అన్నయ్య సంపత్ వినయ్ మాత్రం. బిగ్ బాస్ షణ్ముఖ్‌కి సపోర్ట్ చేయడం లేదని చెప్పడం కొసమెరుపు. తెరవెనుక ఏం జరగుతుందో
You must be logged in to post a comment.