డిసెంబర్ 6: రాశి ఫలాలు, 2022 ఈ రాశుల వారికీ అదృష్టం who?

2022 financial benefits: ఈ 5 రాశులవారు 2022లో ధనవంతులు అవ్వడం ఖాయం.

5 zodiac signs get financial benefits: నూతన సంవత్సరం వచ్చేస్తున్నప్పటికీ చాలా మంది తమ కష్టాలను తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ కొత్త సంవత్సరంలో గ్రహాలు వాటి స్థానాలను మారతాయి. కాబట్టి, ఇది ఆర్థిక స్థితిని కూడా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఓ 5 రాశులవారు 2022లో గ్రహాల గమనం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కన్యారాశి వీరి జాతకంలో కుజుడు బుధుడు, శుక్రుడు, శని నాలుగు గ్రహాలు కలయిక వల్ల 2022 ఆర్థికంగా అనుకూలమైంది. కన్యారాశికి చెందిన విద్యార్థులు ఈ ఏడాది చివరి సంవత్సరంలో విదేశీ విద్య, అసైన్మెంట్లకు మరింత అనుకూల సమయంగా ఉంటుంది.

తులరాశి బుధుడు తులారాశిలోకి ప్రవేశించడం వల్ల మీ జీవితానికి అదనపు అర్థాన్ని ఆనందాన్ని ఇస్తుంది. ఏదైనా తొందరపాటు నిర్ణయానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే లో ఇది సుదీర్ఘ నష్టానికి దారితీస్తుంది. ఉపాధి ఆశించేవారు వారి కలల ఉద్యోగం పొందుతారు.

వృశ్చిక రాశి మధ్యస్తంగా బాధ, సంతోషం, కుంభరాశిలో శని సంచారం దీనికి కారణం. సగటు ఫలితాలు ద్రవ్య పరిస్థితి వృత్తి  కుటుంబ జీవితానికి సంబంధించి ఉంటాయి. కానీ, బృహస్పతి మీన రాశిలోకి వెళ్లినప్పుడు, ఏప్రిల్ మధ్యలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం ప్రారంభమవుతుంది.

కర్కాటక రాశి ఈ రాశివారు సాహసంలో మునిగిపోయే ముందు సమర్థ జోతిషులను తప్పకుండా సంప్రదించాలి. అప్పటి వరకు మీ వనరులను చాలా తెలివిగా ఆర్థికంగా ఉపయోగించాలి. ఆరోగ్య సమస్యలను నివారించడానికి రెగ్యులర్ డైట్కు కట్టుబడి, చాలా కఠినమైన వ్యాయామం చేయండి.

కుంభ రాశి 2022 నాటికి కుంభరాశి జాతకం ఆర్థిక రంగంలో చాలా అనుకూలమైన ఫలితాలను అంచనా వెస్తోంది. కొత్త సంవత్సరం ప్రారంభంలో కుజుడు, శుక్రుడు, బుధుడు, శని గ్రహాలు కలిసి వ్యక్తిగతంగా, వృత్తిపరంగా విజయం సాధిస్తాయి. ఏప్రిల్లో రాహువు మీ రాశి నుంచి మేషం, 3వ ఇంటికి మారినప్పుడు కుంభరాశి వ్యక్తులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.

Horoscope Today: నేటి రాశి ఫలాలు శుభవార్తలు వింటారు  రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది

Today Horoscope: నేడు సోమవారం (డిసెంబర్ 6)  ఇవాళ పలు రాశుల వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని రాశుల వారికి ముఖ్యంగా ఆర్థికంగా ప్రయోజనాలు కనిపిస్తున్మనాయి. మరి మేషం నుంచి మీన రాశి వరకు  ఇవాళ ఎవరికి ఎలా ఉందో తెలసుకుందాం.

Today Horoscope: నేడు సోమవారం  డిసెంబర్ 6  ఇవాళ ఎలాంటి ఫలాలు ఉంటాయి. ఏదైనా ముఖ్య కార్యక్రమంచేపట్టడానికి సరైనా రోజా కాదా ? ఇలా ఏ రోజుకు ఆ రోజు తమ లక్ ఎలా ఉందో తెలుసుకోవాలనే ఉత్సాహం చాలామందిలో ఉంటుంది.అలాంటి వారి కోసం ధిన ఫలాలు అందిస్తోంది న్యూస్ 18 నెట్ వర్క్  మరి మేషం నుంచి మీన రాశి వరకు  ఇవాళ ఎవరికి ఎలా ఉందో దిన ఫలాల ద్వారా తెలుసుకుందాం.

మేషం (Aries)(అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి జరుగుతుంది. అనుకున్నవి సాధిస్తారు. సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. ఖర్చులు పెరిగినా ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. మిత్రులు సహాయంగా ఉంటారు. శుభవార్త వింటారు. వ్యాపారం చాలావరకు నిలకడగా సాగుతుంది

వృషభం (Taurus)(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ముఖ్యమైన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. పట్టుదలతో అనుకున్నవి సాధిస్తారు. ఉద్యోగంలో గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ఆదాయానికి సంబంధించి శుభవా ర్త వింటారు. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాలకు ఎంతోఅనుకూల సమయం.

మిథునం (Gemini)(మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. బంధువుల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు. మిత్రుల సహాయంతో ఒక వ్యక్తిగత సమస్య పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది

కర్కాటకం (Cancer)(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఇంటి సమస్య ఒకటి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగంలో ఆందోళన కలిగించే పరిస్థితులు ఎదుర వుతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. పుణ్యకార్యాలు, సేవా కార్యక్రమాలు చేస్తారు. వ్యాపారులకు కలిసి వస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.

సింహం (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) శుభ సమయం నడుస్తోంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారులు బాధ్యతలను పెంచుతారు. వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీ వల్ల సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల వారి ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది.

కన్య (Virgo)(ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఉద్యోగంలో అధికారుల అండదండలు లభిస్తాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. పెట్టుబడులు పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. శుభవార్త వింటారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు కొద్దిగా లాభాలు ఆర్జిస్తారు.

తుల (Libra)(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. సమాజంలో గుర్తింపు ఉంటుంది.

వృశ్చికం (Scorpio)(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) ఉద్యోగం విషయంలో సమయం అనుకూలంగా ఉంది. అధికారులతో సామరస్యంగా వ్యవహరించండి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వృద్ధికి సంబంధించి కొన్ని నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు అభివృద్ధి సాధిస్తారు.

ధనస్సు (Sagittarius)(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) గట్టిగా ప్రయత్నిస్తే ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వ్యాపారపరంగా లాభాలున్నాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. పెళ్లి సంబంధంఖాయమవుతుంది. వ్యాపారంలో బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి.పిల్లలు శుభవార్త మోసుకొస్తారు.

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author

Am rajitha am a blogger If any one contact me Mail : [email protected]