ట్రస్టు మోసపు చూపుల బాణాలు దేనికోసం.?
-:- "5 ఎకరాలు - 350 కోట్లు"
-:- "కేరాఫ్ గౌడ ఆత్మ గౌరవం @ కోకాపేట"
సొసైటీ వర్సెస్ ట్రస్ట్ (అందరి హక్కు కొందరి కబ్జా)
ట్రస్టు మోసాన్ని చూస్తూనే ఉన్నాను.
సొసైటీ గాయాల్ని చేతితో నిమురుతూనే ఉన్నాను.
ఏమిటి భాగోతం.???
వీళ్ళ జాగీరుగా ట్రస్టు పేరుతో రాయించుకోవడం చూస్తుంటే గతంలో గ్రామాలలో భూస్వామ్య వ్యవస్థలో పెత్తందారీ తనం కబ్జా చెసిన విధానం మళ్ళీ పునరావృతం....
కులం అందరి ఆస్తి, కులానికి చెందిన కొందరు రాజకీయ నాయకులు అక్రమంగా ఆక్రమించే దగుల్బాజీ తనం.
నేడు
ట్రస్టు అహంకారంతో గాంఢ్రిస్తుంది...
గౌడ కులస్తుల ఆత్మ గౌరవ భూమిపై రౌడీయిజం...
ట్రస్టు అనే కబ్జా హుకూం...
కులం ఆస్తిపై కమీనే రాజకీయం...
ట్రస్టుకు బదులు సొసైటీ పేరుతో ఉంటే మీదేం పోతుందో ఒక్కసారి వివరణ ఇవ్వండి. లఫూట్ నాటకాలకు పులిస్టాప్ పెట్టి, గౌడ ఆత్మ గౌరవ భవన స్థలం సొసైటీగా ఉంచండి. సర్కారు ఇచ్చిన ఆస్తికి అందరి హక్కు చట్టం కింద సొసైటీ పేరుతో ఉండాలి.
తెలంగాణ రాష్ట్ర గౌడ కులస్తులకు విన్నపం.
----------
వాస్తవం:-
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 40 లక్షల గౌడ జనం ఆత్మ గౌరవం కోసం హైదరాబాద్ లోని కోకాపేటలో అత్యంత ఖరీదైన (350 కోట్ల) 5 ఎకరాల స్థలం, 5 కోట్ల రూపాయలు కేటాయించి, క్యాబినెట్ ఉత్తర్వులు బీసీ కార్పొరేషన్ కు పంపడం జరిగింది.
బీసీ కార్పొరేషన్ రాష్ట్రంలో ఉన్న గౌడ సంఘాలను సంప్రదించి ఏ పేరుతో సొసైటీ రిజిస్టర్ చెసి ఇస్తారో ఆ పేరుతో అలాట్మెంట్ చేస్తారు. అందరి భాగస్వామ్యం ఉండేలా సొసైటీ విధానం కల్పిస్తారు.
(మొన్న రెడ్డి వైశ్య కులాలకు కూడా ఇచ్చారు. రెడ్డి వారిని అడిగితే పేరు ఇచ్చారు. "రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ" పేరుతో అలాట్మెంట్ చేయించుకున్నారు.)
ఇలా సొసైటీ పేరుతో చేసిన తర్వాత ఇప్పుడు సభ్యత్వం ఉండదు కాబట్టి అధికార పార్టీ నేతలను నామినేటెడ్ పదవులు చైర్మన్ మరియు డైరెక్టర్లు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టర్మ్ వరకు సభ్యత్వం సంఖ్య పెంచి సొసైటీ రిజిస్టర్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుపుతారు.
ఇలా గౌడ కులస్తుల ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇలా 40 లక్షల మంది ప్రాతినిధ్యం, మరియు హక్కు, చట్ట ప్రకారం ఉంటుంది. నిజం ఇలా హక్కుల పరిరక్షణకు దీర్ఘకాలిక కేంద్రం ఈ సొసైటీ విధానం.
--------
మోసం
పైన చెప్పిన దానికి పూర్తి వ్యతిరేక దిశలో కొంత మంది రాజకీయ నాయకులు కుల ఉమ్మడి ఆస్తి కబ్జాకు దిగడం అంటే ఎంత దగుల్బాజీ తనమో కదా. నిజంగా ఈ విషయం జీర్ణించుకోలేనిదే....!?
ఇక్కడ ట్రస్ట్ అనే భూకబ్జా విధానం పుట్టించారు. కొంతమంది రాజకీయ నాయకులు ఓ టీమ్ తయారై వందల కోట్ల రూపాయల ఆస్తి ఉమ్మడిగా కాకుండా మనపైనే చేసుకుంటే మన తదానంతరం మన వారసుల హక్కుగా మారుతుంది. కాబట్టి చట్టం ట్రస్ట్ పేరిట కబ్జాకు రంగం కుదిరిన వెంటనే రిజిస్టర్ ఆధ్వర్యంలో కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఆ కాపీని బీసీ కార్పొరేషన్ కు ఇచ్చి కులం హక్కుల కబ్జాకు పురుడు పోశారు. ఇలా పుట్టిందే ఈ ట్రస్ట్.
ట్రస్టు విధానం ఏందంటే...?
40 లక్షల మందికి గోరికట్టి ట్రస్టీలు బంగ్లా కట్టుకుని ఊరేగే కుట్ర కోణం. ట్రస్టు విధానం.
ఇప్పుడు గిన ట్రస్ట్ పేరిట హక్కులు కల్పిస్తే...? పూర్తి ఆస్తి సొంతదారులు ట్రస్టు మాత్రమే. వీరి మరణానంతరం వీరి వారసులు మాత్రమే ట్రస్టీలుగా హక్కు కలిగి ఉంటారు. అంటే 40 లక్షల మంది హక్కులు పూర్తిగా కోల్పోయినట్లే. ఊళ్ళు పంచుకున్నట్లు... కులం అందరి భూమి ట్రస్ట్ పేరిట వీరు పంచుకుంటారు. అంటే మోసం గమ్మత్తుగా కనపడుతుంది కదా.!!
ట్రస్టీల వేషంలో కొంత మంది కులం ఆస్తి కబ్జా చేయడం.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ సంఘాలను సంప్రదించకుండా, కొంతమంది గూడుపుటాని గుంపు ట్రస్ట్ పేరిట బీసీ కార్పొరేషన్ కు ఇవ్వడం. ఆత్మ గౌరవ ఆస్తి కబ్జాకు ఎత్తుగడ.
ఉమ్మడి సొత్తు కబ్జాకు నీతిమాలిన మూర్ఖత్వం.
మేమే మొనగాళ్లం అనే అహంకారం. ఎవ్వరూ మమ్మల్ని అడుగరనే కుట్ర కోణం. ట్రస్టు పేరుతో భూమి పూజకు సిద్ధం కావడమంటే ఏమిటి భాగోతం.
ట్రస్టు పెద్దలకు చిన్న విజ్ఞప్తి:-
-----------
మీరు రాజకీయంగా ఈ స్థాయికి అనేక కష్టనష్టాలను ఎదుర్కొని నిలబడ్డారు. అందుకే మీ పేర్లను బహిర్గతం చేయలేక పోతున్న. కాబట్టి మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీరు ఏర్పర్చుకున్న ట్రస్ట్ రద్దు చేసి, అదే స్థానంలో సొసైటీ పేరుతో ఉండాలి.
లేదా పూర్తి ఆధారాలతో
- ముఖ్యమంత్రి గారికి
- మంత్రి కేటీఆర్ గారికి
- సీఎస్ సోమేష్ కుమార్ గారికి
- బీసీ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బూర వెంకటేశం గారికి
- కోర్టు ద్వారా నోటీసు జారీ చేయడం జరుగుతుంది.
మీ ఇష్టం....?!
You must be logged in to post a comment.