బిగ్ బాస్ 5 విన్నర్ Sunny: ‘సన్నీ. మీ సమయం వచ్చేసింది’. విన్నర్ ఇతనే అని బిగ్ బాస్ హింట్ ఇచ్చేశారా? సన్నీ జర్నీ వీడియ
ఓటింగ్ :
సన్నీ -55%
షణ్ముఖ్ -31%
శ్రీరామ్ -10%
సిరి - 3%
మానస్ -2%
గత సీజన్‌లో ‘కథ వేరే ఉంటుంది’ అని సొహైల్ హౌస్‌లో అల్లాడించాడు. తను విన్నర్ కాలేకపోయినప్పటికీ విన్నర్, రన్నర్ కంటే ఎక్కువ క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే ఈ సీజన్‌లో సన్నీ ‘అప్నా టైం ఆయేగా. అంటూ అల్లాడిస్తున్నాడు.
‘‘కప్పు ముఖ్యం బిగులూ’’ ఈమాట వీజే సన్నీకి గట్టిగానే నాటుకునిపోయినట్టు ఉంది. విజయానికి ఒక్క అడుగు దూరంలో ఉన్న వీజే సన్నీ. గత రాత్రి ప్రసారం అయిన ఎపిసోడ్‌లో కప్పు కొడుతున్నా. అమ్మకి గిఫ్ట్‌గా ఇస్తున్నా. ఇది ఫిక్స్ అని మానస్‌తో చెప్పేశాడు. ఇక ఫైనల్‌కి చేరిన టాప్ 5 కంటెస్టెంట్స్ జర్నీని చాలా ఎమోషనల్‌గా చూపిస్తున్నారు బిగ్ బాస్.
టైటిల్ ఎవరు గెలుస్తారో తెలియదు కానీ. ప్రస్తుతం టాప్ 5లో ఉన్న ఐదుగురికి టైటిల్ కొట్టినంత రేంజ్‌లో బీభత్సమైన హైప్ ఇచ్చారు బిగ్ బాస్. సోమవారం నాటి ఎపిసోడ్‌లో శ్రీరామ్, మానస్‌ల ఎమోషనల్ జర్నీని చూపించారు. ఇక నేటి ఎపిసోడ్‌లో షణ్ముఖ్, సన్నీల జర్నీలకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
సన్నీ తన పోస్టర్స్ చూసుకుని ఫుల్ ఫన్ జనరేట్ చేస్తున్నాడు. హౌస్‌లో కేక్ పెట్టి దీన్ని తినే అర్హత ఎవరికి ఉందని బిగ్ బాస్ అడిగినప్పుడు. హౌస్‌లో ఉన్న వాళ్లంతా తినాలా వద్దా అని జుట్టుపీక్కుంటుంటే. ఆ కేక్‌ని లటక్ మని తినేశాడు. అయితే ఆ కేక్ తినడం వల్ల సన్నీకి అదనంగా స్పెషల్ పవర్స్ ఏమీ ఇవ్వలేదు. ఏమీ ఇవ్వనప్పుడు అంత హైప్ ఎందుకు ఇచ్చారు ఆ కేక్ ఎపిసోడ్‌కి అని సన్నీ ఫ్యాన్స్ చాలామంది బిగ్ బాస్‌ని తిట్టుకున్నారు. అయితే తాజాగా సన్నీ జర్నీలో మళ్లీ అలాంటి కేక్‌నే పెట్టి సర్ ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్. అయితే ఈసారి ఆ కేక్‌ను తినకుండా. వెయిట్ ఫర్ క్లైమాక్స్ అంటూ రజినీ స్టైల్‌లో డైలాగ్ చెప్పాడు సన్నీ
ఆ తరువాత తన తల్లి ఫొటోని చూసుకుంటూ కళావతి. టాప్ 5లో ఉన్నా. విజయానికి మరో అడుగుదూరంలో ఉన్నానని చెప్పాడు సన్నీ. ఆ తరువాత బిగ్ బాస్ సన్నీ జర్నీని అద్భుతంగా విశ్లేషించారు. ‘సరదా సన్నీ ఒకే అక్షరంతో మొదలౌతాయని. మీరు గుర్తు చేశారు. గెలిచిన ఆటలు. జరిగిన గొడవలు. మోసిన నిందలు. చేసిన వినోదం. ఎన్ని ఒడుదుడుగులు వచ్చినా అందరి మొహంపైనవ్వు తీసుకుని వచ్చి ఎంటర్ టైనర్‌గా అందరి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఒంటరిగా వచ్చిన మనిషికి కొంచెం ప్రేమను సంపాదించుకోవడం కంటే పెద్ద విజయం ఏదీ లేదని మీరు సాధించిన విజయమే మీకు గుర్తు చేస్తుంది.
అప్నా టైం ఆయేగా. సన్నీ మీ సమయం వచ్చేసింది’ అని అన్నారు బిగ్ బాస్. అప్నా టైం ఆయేగా. అనేది సన్నీ పదే అంటుంటారు. ఇప్పుడు బిగ్ బాస్ కూడా అప్నా టైం ఆయేగా. అంటూ సన్నీ టైం వచ్చేసింది అని అన్నారంటే. బిగ్ బాస్ సీజన్ 5 విజేత అతనే అని హింట్ ఇచ్చేశారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. మొత్తానికి గత సీజన్‌లో సొహైల్ ‘కథ వేరే ఉంటుంది’ అనే డైలాగ్ ఫేమస్ కాగా. ఈ సీజన్‌లో సన్నీ ‘అప్నా టైం ఆయేగా’. అంతే పాపులర్ అయ్యింది. చూద్దాం సన్నీకి టైం వచ్చిందో లేదో.
అప్నా టైం ఆయేగా. సన్నీ మీ సమయం వచ్చేసింది బిగ్ బాస్ ప్రశంసల వర్షం
బిగ్ బాస్ ఇంట్లో ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్ల జర్నీ వీడియోలు చూపిస్తున్నారు. ఇందులో భాగంగా నేటి ఎపిసోడ్‌లో సన్నీ, షన్నుల ప్రయాణానికి సంబంధించిన జర్నీ వీడియోలను చూపించబోతోన్నారు.
బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ ముగిసేందుకు సమయం ఆసన్నమైంది. ఇక మిగిలింది ఈ ఒక్క వారం మాత్రమే. ఆల్రెడీ అందులో ఒక రోజు అయిపోయింది. ఈ చివరి ఎలాంటి టాస్కులుండవన్న సంగతి తెలిసిందే. టాప్ 5 కంటెస్టెంట్ల జర్నీ వీడియోలతో షోను లాగించేస్తారు. ఇక చివరి రెండు రోజులు బిగ్ బాస్ 5 కంటెస్టెంట్లందరినీ ఇంట్లోకి తీసుకొస్తారేమో చూడాలి. నిన్న మానస్, శ్రీరామచంద్ర జర్నీ వీడియో అందరినీ ఆకట్టుకున్నాయి.
ఇక నేటి ఎపిసోడ్‌లో షన్ను, సన్నీ జర్నీల వీడియోలను చూపించబోతోన్నారు. మొత్తానికి షన్ను, సన్నీలు తమ జర్నీలను చూసి తెగ ఎమోషనల్ అయిపోయేట్టు కనిపిస్తోంది. షన్ను అయితే కామ్ అండ్ కంపోజ్డ్ అంటూ బిగ్ బాస్ పొగిడేశాడు. ఇక సన్నీని అయితే బిగ్ బాస్ ఇంటికి ఎంటర్టైనర్ అని ఆకాశానికెత్తేశాడు. సరదా, సన్నీ అనే పదాలు ఒకే అక్షరంతో మొదలవుతాయని మీరు గుర్తు చేశారంటూ సన్నీని పొగిడేశాడు.
గెలిచిన ఆటలు, జరిగిన గొడవలు, మోసిన నిందలు, చేసిన వినోదం, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అందరి మొహంపై నవ్వు తీసుకొచ్చే ఎంటర్టైనర్‌గా అందరి మదిపై చెరగని ముద్ర వేసుకున్నారు. ఒంటరిగా వచ్చే మనిషికి కొంచెం ప్రేమని సంపాదించుకోవడం కన్నా పెద్ద విజయం ఏదీ లేదని మీరు సాధించిన ప్రయాణమే మళ్లీ రుజువు చేస్తోంది. అప్నా టైం ఆయేగా సన్నీ మీ సమయం వచ్చేసింది అంటూ బిగ్ బాస్ అన్న మాటలకు సన్నీఎమోషనల్ అయ్యాడు.
మొత్తానికి సన్నీ జర్నీ వీడియో మాత్రం రోలర్‌కోస్టర్ రైడ్‌లా ఉంటుంది. నవ్వులు, ఏడుపులు, కోపాలు, తాపాలు, సరదాలు అన్నీ కలగలపి ఉంటాయి. ప్రోమోలో చెప్పినట్టుగా. ఇంకో అడుగు దూరంలో సన్నీ ఉన్నట్టు కనిపిస్తొంది. బయటి ఓటింగ్ ట్రెండ్‌లో సన్నీ టాప్ ప్లేస్‌లో దూసుకుపోతోన్నాడు. ఇదే గనుక కంటిన్యూ అయితే మాత్రం బిగ్ బాస్ టైటిల్‌లను సన్నీ కైవసం చేసేసుకుంటాడనడంలో సందేహం లేదు.
You must be logged in to post a comment.